ఎస్పీ బాలసుబ్రమణ్యం మరణం సంగీత లోకానికి తీరని లోటని పలువురు వక్తలు అన్నారు. హైదరాబాద్ నగరం సికింద్రాబాద్లోని నామాలగుండులో బ్రాహ్మణ సేవా సమితి ఆధ్వర్యంలో సినీ ప్రముఖులు, కవులు, కళాకారులు, రచయితలతో స్వర నివాళి కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు.
ఎస్పీ బాలుకు కళాకారుల స్వర నివాళి - రచయితలతో స్వర నివాళి
సికింద్రాబాద్లోని నామాలగుండులో బ్రాహ్మణ సేవా సమితి ఆధ్వర్యంలో సినీ ప్రముఖులు, కవులు, కళాకారులు, రచయితలతో స్వర నివాళి కార్యక్రమాన్ని నిర్వహించారు. సంగీత స్వరానికి నూతన అర్థాన్ని చెప్పిన గొప్ప వ్యక్తి బాలసుబ్రమణ్యం అని పలువురు వక్తలు అభివర్ణించారు. గాయకులు పాటలు పాడుతూ అందరిని ఆకట్టుకున్నారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెరాస దిల్లీ అధికార ప్రతినిధి వేణుగోపాలచారి హాజరై ఎస్పీ బాలసుబ్రహ్మణ్యానికి నివాళులర్పించారు. ఎస్పీ బాలసుబ్రమణ్యం చిత్రపటానికి దీపారాధన చేశారు. బాలసుబ్రహ్మణ్యం పాడిన అద్భుతమైన పాటలను వారు పాడుతూ ఆయన జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు.
వేలాది పాటలు పాడి లక్షల మంది అభిమానులను సంపాదించుకున్న గొప్ప వ్యక్తి ఎస్పీ బాలసుబ్రమణ్యం అని ఆయనను కొనియాడారు. సంగీత లోకంలో గొప్ప వ్యక్తిగా ఎస్పీ బాలసుబ్రమణ్యం నిలిచారని అన్నారు. బాలసుబ్రహ్మణ్యం పాడిన పాటలకు గానూ ఆయన ఎంతో కీర్తి ప్రతిష్టలు సంపాదించుకున్నారని అన్నారు.