నేడు నిర్వహించే జడ్పీ ఛైర్మన్లు, వైస్ ఛైర్మన్లు, కో ఆప్టెడ్ సభ్యుల ఎన్నికల దృష్ట్యా... జడ్పీటీసీల సమావేశానికి ఎస్‌ఈసీ ఏర్పాట్లు పూర్తి చేసింది. రేపు ఉదయం 10 గంటల్లోపు నామినేషన్ల స్వీకరణకు అధికారులు అవకాశం ఇచ్చారు. ఉదయం 10గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు నామినేషన్లు పరిశీలిస్తారు. మధ్యాహ్నం 12 గంటలకు నామినేషన్లు దాఖలు చేసిన అభ్యర్థుల జాబితా ప్రకటిస్తారు. మధ్యాహ్నం ఒంటిగంటలోపు నామినేషన్ల ఉపసంహరణకు అవకాశం ఉంటుందని అధికారులు తెలిపారు. మధ్యాహ్నం ఒంటిగంటకు కో ఆప్టెడ్ సభ్యుల ఎన్నిక, అనంతరం ప్రమాణ స్వీకారం ఉంటుందని తెలిపారు. మధ్యాహ్నం 3 గంటలకు జడ్పీ ఛైర్మన్లు, ఇద్దరు వైస్ ఛైర్మన్లు, ఎన్నిక కోసం ప్రత్యేక సమావేశం నిర్వహిస్తారు.
నేడు జెడ్పీ ఛైర్మన్లు, వైస్ ఛైర్మన్ల ఎన్నిక.. వెంటనే ప్రమాణస్వీకారం! - arrangements-completed-for-zptc-elections
జడ్పీ ఛైర్మన్ల ఎన్నికల దృష్ట్యా అధికారులు అన్ని రకాల ఏర్పాట్లు పూర్తి చేశారు. ఉదయం 10గంటల్లోపు నామినేషన్లు స్వీకరించి, మధ్యాహ్నం ఒంటిగంటకు కో-ఆప్టెడ్ సభ్యుల ఎన్నిక ఉంటుందని తెలిపారు.
మధ్యాహ్నం ఒంటి గంటకు ఎన్నిక
Last Updated : Sep 25, 2021, 1:06 AM IST