ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

Swearing ceremony: హైకోర్టు నూతన ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్‌ మిశ్రా.. ఈనెల 13న ప్రమాణ స్వీకారం - జస్టిస్‌ ప్రశాంతకుమార్‌ మిశ్రా తాజా వార్తలు

రాష్ట్ర హైకోర్టు నూతన ప్రధాన న్యాయమూర్తిగా నియమితులైన జస్టిస్‌ ప్రశాంతకుమార్‌ మిశ్రా ప్రమాణ స్వీకారం.. ఈ నెల 13న జరగనుంది. విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో.. జస్టిస్‌ మిశ్రాతో రాష్ట్ర గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌ ప్రమాణ స్వీకారం చేయించనున్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్​ రెడ్డితో సహా పలువురు ప్రముఖులు ఈ కార్యక్రమానికి హాజరుకానున్నారు.

Arrangements are being made for Chief Justice Prashant Kumar Mishra's swearing ceremony on 13th october
ఈ నెల 13న జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా ప్రమాణ స్వీకారం

By

Published : Oct 10, 2021, 6:38 PM IST

రాష్ట్ర హైకోర్టు నూతన ప్రధాన న్యాయమూర్తిగా నియమితులైన జస్టిస్‌ ప్రశాంతకుమార్‌ మిశ్రా.. ఈనెల 13న బాధ్యతలు స్వీకరించనున్నారు. విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో.. జస్టిస్‌ మిశ్రాతో రాష్ట్ర గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌ ప్రమాణ స్వీకారం చేయించనున్నారు. జస్టిస్‌ పి.కె.మిశ్రా చత్తీస్‌గఢ్‌ హైకోర్టు న్యాయమూర్తిగా కొనసాగుతూ.. ప్రస్తుతం అక్కడ తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి హోదాలో ఉన్నారు.

రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ అరబ్‌కుమార్‌ గోస్వామి.. చత్తీస్‌గఢ్‌ హైకోర్టుకు బదిలీ కావడంతో ఈరోజు ఆయనకు హైకోర్టులో వీడ్కోలు పలికారు. జస్టిస్‌ ప్రశాంతకుమార్‌ మిశ్రా.. ఈనెల 12వ తేదీ విజయవాడ రానున్నారు. ప్రమాణ స్వీకార ఏర్పాట్లను.. సీఎం కార్యదర్శి ముత్యాలరాజు, కృష్ణా జిల్లా కలెక్టరు జె.నివాస్‌, నగర పోలీసు కమిషనర్‌ బి.శ్రీనివాసులు సమీక్షించారు.

ముఖ్యమంత్రి జగన్మోహన్​ రెడ్డితో పాటు శాసనసభ స్పీకర్‌, శాసనమండలి ఛైర్మన్‌, మంత్రులు, హైకోర్టు న్నాయమూర్తులు.. మొత్తం 200 మంది వరకు ఈ కార్యక్రమానికి హాజరవుతారని అంచనా వేస్తున్నారు.

ఇదీ చదవండి:

Farewell: న్యాయవృత్తి టీ-20 అంత సులభం కాదు: జస్టిస్ గోస్వామి

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details