ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

ఏపీ ఉద్యోగుల సంఘం నేతలతో ఆరోగ్యశ్రీ ట్రస్ట్ జిల్లా అధికారి సమావేశం - Arogyasree Trust District Officer news

ప్రైవేట్ నెట్​వర్క్ ఆసుపత్రుల్లో.. ఉద్యోగుల హెల్త్​కార్డ్ అమలుకు సంబంధించి తమకు ఫిర్యాదు చేయాలని ఆరోగ్యశ్రీ ట్రస్ట్ జిల్లా అధికారి డా. సుబ్రమణ్యం తెలిపారు. విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో ఉద్యోగులకు ప్రత్యేక ఓపీని ఏర్పాటు చేశామని చెప్పారు.

meeting
సమావేశం

By

Published : Feb 16, 2021, 4:27 PM IST

ఉద్యోగుల హెల్త్​కార్డ్ అమలుకు సంబంధించి ప్రైవేట్ నెట్​వర్క్ ఆసుపత్రుల్లో సమస్యలు వస్తే తమకు ఫిర్యాదు చేయాలని ఆరోగ్యశ్రీ ట్రస్ట్ జిల్లా అధికారి డా. సుబ్రమణ్యం అన్నారు. ఏపీ ఉద్యోగుల సంఘం నేతలతో విజయవాడలో ఆయన సమావేశం ఏర్పాటుచేశారు. హైదరాబాద్​లో ఏపీ ఉద్యోగులకు హెల్త్ కార్డుపై వైద్య సేవలు అందించే నెట్​వర్క్ ఆసుపత్రులకు అదనంగా.. మరో 14 ఆసుపత్రుల్లో సేవలు అందించనున్నట్లు తెలిపారు. విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో మధ్యాహ్నం 2 నుంచి 4 గంటల వరకు.. ఉద్యోగులకు ప్రత్యేక ఓపీని ఏర్పాటు చేశామన్నారు.

ABOUT THE AUTHOR

...view details