విజయవాడ నగరపాలక సంస్థ ఆఖరి సర్వసభ్య సమావేశంలో అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య వాగ్వాదం జరిగింది. మేయర్ కోనేరు శ్రీధర్ అధ్యక్షతన చివరి సర్వసభ్య సమావేశంలో.. కౌన్సిల్ సమావేశ మందిరంలోని ఎన్టీ రామారావు, చంద్రబాబునాయుడు చిత్రపటాలను తొలగించటం ఘర్షణకు దారి తీసింది. తమకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా తొలగించారని.. తెదేపా సభ్యులు అధికారులను నిలదీశారు. జోక్యం చేసుకున్న వైకాపా సభ్యులు నూతన ప్రభుత్వం అధికారంలోకి వచ్చి నెల రోజులవుతుందని గుర్తు చేశారు. మందిరంలో ముఖ్యమంత్రి జగన్ ఫోటో ఉంచాలని డిమాండ్ చేశారు. వైకాపా, తెదేపా సభ్యులు ఒకరిపై ఒకరు వాదోపవాదాలు చేసుకుంటుండటం వల్ల మేయర్ సమావేశాన్ని ఒక గంట వాయిదా వేశారు. కాసేపటికి ఎన్టీఆర్ చిత్రపటాన్ని యథాస్థానంలో ఉంచటంతో తెదేపా సభ్యులు నిరసన విరమించారు.
విజయవాడ నగరపాలక సంస్థ సర్వసభ్య సమావేశం రసాభాస
విజయవాడ నగరపాలక సంస్థ సమావేశ మందిరంలో ఎన్టీఆర్, చంద్రబాబు చిత్రాలను తొలగించడంతో గందరగోళం నెలకొంది. ఆఖరి సర్వసభ్య సమావేశంలో అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది.
నగరపాలక సంస్థ సర్వసభ్య సమావేశంలో రసాభాస