విజయవాడలో దారుణం జరిగింది. ఏఆర్ కానిస్టేబుల్ శివనాగరాజు.. వెంకటేశ్ అనే యువకుడిని హత్య చేశాడు. తన భార్యతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడని యువకుడిని మంగళవారం రాత్రి కానిస్టేబుల్ కొట్టాడు. తీవ్రంగా గాయపడ్డ వెంకటేశ్ కొద్దిసేపటి తర్వాత చనిపోయాడు.
MURDER: ఏఆర్ కానిస్టేబుల్ దాడిలో యువకుడు మృతి - విజయవాడ నేర వార్తలు
ఎవరైనా ఆపదలో ఉంటే ఆదుకోవాల్సిన వాడు.. సంయమనంతో సమస్యను పరిష్కరించాల్సిన బాధ్యతలు నిర్వర్తిస్తున్నవాడు.. ఎవరైనా తప్పు చేస్తే సరిదిద్ది.. సరైన మార్గంలో నడిచేలా హితబోధ చేయాల్సిన వాడు.. కానీ ఆవేశంలో అన్నీ మర్చిపోయాడు.. తన భార్యతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడనే కారణంతో ఓ యువకుడిపై విరుచుకుపడ్డాడు. అతని ప్రాణాలు పోయేందుకు కారణమయ్యాడు.
హత్య
గతంలో అనేకసార్లు శివనాగరాజు.. వెంకటేశ్‌ను హెచ్చరించాడు. అయినా వెంకటేశ్ తన తీరును మార్చుకోలేదు. మంగళవారం రాత్రి వెంకటేశ్.. శివనాగరాజు భార్యతో చనువుగా మాట్లాడుతూ రెడ్ హ్యాండెడ్‌గా దొరికాడు. వంట గదిలోని సామాగ్రితో శివనాగరాజు..వెంకటేశ్‌ను తీవ్రంగా గాయపరిచాడు. దీంతో వెంకటేశ్ మృతి చెందాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. డిపార్ట్మెంట్కు సంబంధించిన సంఘటన కావటంతో పోలీసులు గోప్యతగా వ్యవహరిస్తున్నారు.
ఇదీ చదవండి:
హైదరాబాద్ అడ్డాగా దంపతుల వ్యభిచార దందా
Last Updated : Aug 11, 2021, 9:53 PM IST