ఏపీజేఏసీ పదవులకు ఏపీటీఎఫ్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శుల రాజీనామా - ఏపీజేఏసీ న్యూస్
11:09 February 06
లేఖ విడుదల చేసిన ఏపీటీఎఫ్ ప్రధాన కార్యదర్శి వరప్రసాదరావు
ఏపీజేఏసీ పదవులకు.. ఏపీటీఎఫ్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు రాజీనామా చేశారు. ఈమేరకు ఏపీటీఎఫ్ ప్రధాన కార్యదర్శి పాండురంగ వరప్రసాదరావు లేఖను విడుదల చేశారు. ఉద్యోగుల ఉపాధ్యాయుల, పెన్షనర్ల ఆశలను ఏపీ జేఏసీ వమ్ము చేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఛలో విజయవాడ సహా ఉద్యోమ కార్యాచరణలో ఏపీటీఎఫ్ తీవ్రమైన కృషి చేసిందన్నారు. ఎలాంటి ఫలితాలు రాకుండానే పీఆర్సీ సాధన సమితి నేతలు ఉద్యమాన్ని విరమించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. స్టీరింగ్ కమిటీకి ప్రభుత్వం నుంచి ఎటువంటి హామీ రాలేదని.. పీఆర్సీ ముగిసిన అధ్యాయమని ప్రభుత్వం ప్రకటించి అవమానించిందన్నారు. మరోవైపు ఉపాధ్యాయ సంఘాలు సైతం.. ఇవాళ సాయంత్రం సమావేశమై భవిష్యత్తు కార్యాచరణ ప్రకటిస్తామని తెలిపారు.
ఇదీ చదవండి:UTF LEADER: ప్రభుత్వంతో ఉపాధ్యాయుల చర్చలు విఫలం: యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు