ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

ఉల్లాసంగా.. ఉత్సాహంగా.. పర్యాటక శాఖ ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు

సంక్రాంతి సంబరాల్లో భాగంగా.. రాష్ట్ర టూరిజం శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన కళా ప్రదర్శనలు, ఆటలపోటీలు పర్యాటకులను, ప్రజలను విశేషంగా ఆకట్టుకున్నాయి. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు చెందిన ప్రముఖ కళాకారులను.. విజయవాడలోని భవానీపురంలో ఉన్న బెరుం పార్కుకు ఆహ్వానించిన ఏపీటీడీసీ.. ఉదయం నుంచి సాయంత్రం వరకు వివిధ కార్యక్రమాలు నిర్వహించింది. పల్లెదనం ఉట్టిపడే కోలాటాలు మొదలు.. హొయలొలికించే ఫ్యాషన్ షోల వరకూ ఎన్నో కార్యక్రమాలు ఏర్పాటు చేసింది.

పర్యాటక శాఖ ఆధ్వర్యంలో ఘనంగా పండగ సంబురాలు
పర్యాటక శాఖ ఆధ్వర్యంలో ఘనంగా పండగ సంబురాలు

By

Published : Jan 16, 2022, 10:57 PM IST

రాష్ట్ర పర్యాటక శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన సంక్రాంతి వేడుకలు ఘనంగా ముగిశాయి. మూడు రోజులపాటు సాగిన వివిధ పోటీలు ప్రజలను విశేషంగా ఆకట్టుకున్నాయి. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలతోపాటు, తెలంగాణ నుంచి సైతం కళాకారులు ఈ పోటీలకు హాజరయ్యారు. మెుదటిరోజు చిత్రలేఖనం, పిల్లలతో నృత్య ప్రదర్శనలు చేయించారు. చిత్రలేఖనం పోటీల్లో పాల్గొనేందుకు యువత ఆసక్తి చూపారు. పల్లెవాతావరణం తాలూకు ఆహ్లాదకర వాతావరణాన్ని కుంచెలతో సృష్టించారు చిత్రకారులు. అటు పిల్లలు చేసిన నాట్యాలు ఆద్యంతం ఆకట్టున్నాయి. తెలుగు సంప్రదాయాలు ఎక్కడా మరువకుండా నేటి యువతకు, పిల్లలకు అందించాలనే ఉద్దేశంతోనే ఈ వేడుకలను నిర్వహిస్తున్నట్లు ఏపీ టూరిజం అధికారులు తెలిపారు. మొదటి రోజు నిర్వహించిన ముగ్గుల పోటీల్లో గెలిపొందిన విజేతలకు బహుమతలు ప్రదానం చేశారు.

పర్యాటక శాఖ ఆధ్వర్యంలో ఘనంగా పండగ సంబురాలు

కృష్ణా తీరంతో..
ఏపీటీడీసీ ఆధ్వరంలో రెండో రోజు సైతం పిండివంటలు సహా వివిధ కార్యక్రమాలు నిర్వహించారు. సంక్రాంతి పండుగలో.. చివరిరోజైన కనుమ సందర్భంగా భవానీపురంలోని బెరం పార్కు, భవానీ ఐలాండ్.. కోలాటం, డప్పు శబ్దాలు, కేరింతలతో మారు మోగాయి. సాయంత్రం మూడు గంటలకు భవానీ ఐలాండ్​తో పాటు, కృష్ణా నదీ తీరాన ఏర్పాటు చేసిన వేడుకలు మరింత ఆసక్తిగా సాగాయి. ఆటలు, పాటలు, నృత్యాలు, ఫ్యాషన్ షో నిర్వహించారిక్కడ. తెలుగుదనం ప్రతిబింబించేలా మహిళలు సంప్రదాయ దుస్తుల్లో క్యాట్ వాక్ చేస్తూ ఔరా అనిపించారు. చిన్నపిల్లలు సైతం ఫ్యాషన్ షోలో పాల్గొన్నారు. పరిటాల నుంచి వచ్చి పిల్లలు చేసిన కోలాటం అదిరిపోయింది. ఉయ్యూరు నుంచి వచ్చిన యువత మోగించిన డప్పులతో.. కృష్ణమ్మ తీరం పులకించిపోయింది.

తెలుగు రాష్ట్రాల్లో ఒకప్పుడు పండుగలంటే తెలుగుదనం పల్లెదనం, ప్రాచీన కళలకు నిదర్శనం. ప్రస్తుతం మారుతున్న కాలానికి అనుగుణంగా కళలన్నీ మరుగున పడిపోతున్నాయి. కనీసం పండుగలప్పుడైనా మన కళల్ని చూసి సంతోషంగా గడపాలి. ఏపీ టూరిజం ఆధ్వర్యంలో కోలాటం చిన్నపిల్లలతో చేయటం సంతోషంగా ఉంది. - ఏడుకొండలు, వెంకటశైలజ, పర్యాటకులు

అటు కృష్ణమ్మ అందాలు, ఏపీ టూరిజం ఏర్పాటు చేసిన సంక్రాంతి ఉత్సవాలు చూసేందుకు హైదరాబాద్ సహా పలు ప్రాంతాల నుంచి పర్యాటకులు భారీగా తరలి వచ్చారు.

ఇదీ చదవండి:కరోనా ఎఫెక్ట్: శ్రీశైలం దేవస్థానం కీలక నిర్ణయాలు

ABOUT THE AUTHOR

...view details