ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

కరోనా సేవల్లో ఆర్టీసీ...విపత్కర పరిస్థితుల్లో విస్తృత సేవలు ! - కరోనా సేవల్లో ఆర్టీసీ

కరోనా కష్టకాలంలో వైద్య సేవల్లో సాయమందించిన ఆర్టీసీ...మరో అడుగు ముందుకేసి సామాన్య ప్రజలకు మరింత చేరువ కానుంది. కొవిడ్‌ భయంతో బయటకు వచ్చేందుకు బయపడుతున్న ప్రజల చెంతకే తాజా కూరగాయలు అందించనుంది. కంటైన్మెంట్ ప్రాంతాల్లో సేవలందించేందుకు ఆర్టీసీ బస్సులను సంచార కూరగాయల వాహనాలుగా మార్చనున్నారు.

కరోనా సేవల్లో ఆర్టీసీ...విపత్కర పరిస్థితుల్లో విస్తృత సేవలు !
కరోనా సేవల్లో ఆర్టీసీ...విపత్కర పరిస్థితుల్లో విస్తృత సేవలు !

By

Published : Jul 13, 2020, 4:44 AM IST

కరోనా మహమ్మారి దెబ్బకు ప్రజలకు రోడ్లమీదకు వచ్చేందుకే జంకుతున్నారు. రెడ్‌జోన్‌, కంటైన్మెంట్ ప్రాంతాల్లో నిత్యవసరాలు దొరక్క ప్రజలు తీవ్ర ఇబ్బందులుపడుతున్నారు. అలాంటి ప్రాంతాల్లో తాజా కూరగాయలు అందించేదుకు ఆర్టీసీ ముందుకొచ్చింది. పాత బస్సులను సంచార కూరగాయల వాహనాలుగా మార్పులు చేసి ప్రజలకు మరిన్ని సేవలు అందించనుంది. నిత్యవసరాలు, కూరగాయల కోసం ప్రజలు మార్కెట్ల వద్దకు పెద్దఎత్తున తరలిరావడం వల్ల కొవిడ్‌ వేగంగా విస్తరిస్తోంది. దీన్ని నివారించేందుకు....ప్రజల వద్దకే కూరగాయలు అందించేందుకు ఆర్టీసీ ముందుకొచ్చింది.

తుక్కుగా మార్చకుండా...

ప్రతి నియోజకవర్గానికి ఒకటి కేటాయించేలా వాహనాలకు మార్పు చేస్తున్నారు. కంటైన్మెంట్‌ జోన్లు సహా అవసరమైన ప్రాంతాలకు ఈ వాహనాల్లో తాజా కూరగాయలు సరఫరా చేయనున్నారు. కాలం చెల్లిన వాహనాలను తుక్కుగా మార్చకుండా....వాటిని కరోనా సేవలకు వినియోగించుకునేలా ఆర్టీసీ ప్రణాళికలు సిద్ధం చేస్తోంది.

కొవిడ్ టెస్టింగ్ ల్యాబ్​లుగా..

ఇప్పటికే పలు విధాలుగా కరోనా సేవల్లో ఆర్టీసీ పాలుపంచుకుంటోంది. ప్రజలకు సత్వర వైద్య సేవలు అందించేందుకు 52 ఏసీ బస్సులను కొవిడ్ టెస్టింగ్ ల్యాబ్‌లుగా మార్చి సేవలు అందిస్తోంది. కరోనా పరీక్షల కోసం ఒక్కో జిల్లాకు రెండు చొప్పున సంజీవని బస్సులను పంపింది. ఈ బస్సుల్లో మారుమూల ప్రాంతాలకు సైతం వెళ్లి వైద్య సిబ్బంది అనుమానితులకు కొవిడ్ పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఒకేసారి పది నమూనాలు తీసుకునే విధంగా బస్సులను రూపొందించారు.

ఇదీచదవండి పోలవరాన్ని పూర్తి చేసేది సీఎం జగనే: ఎంపీ విజయసాయిరెడ్డి

ABOUT THE AUTHOR

...view details