లాక్ డౌన్ వల్ల ఏటీబీ కేంద్రాలు, ఆర్టీసీ కౌంటర్లు తెరవకపోవడంతో ప్రయాణికులు ఆ టికెట్లను రద్దు చేసుకోలేదు. దీంతో వారి విజ్ఞప్తి మేరకు మరోసారి టికెట్ల రద్దు గడువు పెంచుతున్నట్లు ఆర్టీసీ ప్రకటనలో తెలిపింది. ఆగస్టు 31 నుంచి సెప్టెంబర్ 14 వరకు టికెట్లను రద్దు చేసుకునేందుకు అవకాశం కల్పించినట్లు తెలిపింది. ఏటీబీ, బస్టాండ్ కౌంటర్లలో టికెట్లు తీసుకున్న ప్రయాణికులు తమ వద్ద ఉన్న టికెట్లను అక్కడికే తీసుకెళ్లి రద్దు చేసుకుని నగదు పొందవచ్చని ఆర్టీసీ ఈడీ బ్రహ్మానందరెడ్డి తెలిపారు.
లాక్డౌన్లో టికెట్ బుక్ చేశారా?.. ఇప్పుడు రద్దు చేసుకోండి
లాక్ డౌన్ సమయంలో రద్దైన బస్సు సర్వీసుల్లో టికెట్లు తీసుకున్న ప్రయాణికుల టికెట్ రద్దు చేసుకునే గడువును ఆర్టీసీ మరోసారి పెంచింది. ఆన్ లైన్ ద్వారా టికెట్ తీసుకున్న వారికి వారి ఖాతాలో చెల్లింపులు చేసిన ఆర్టీసీ.. ఏటీబీ, బస్టాండ్ కౌంటర్లలో తీసుకున్న వారందరి టికెట్లను రద్దు చేయలేకపోయింది.
లాక్డౌన్లో టికెట్ బుక్ చేశారా?.. ఇప్పుడు రద్దు చేయండి