ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

సరుకు రవాణా మరింత విస్తరణ.. కార్గో సర్వీసుల ఛార్జీలు తగ్గింపు - apsrtc cargo services

ఏపీఎస్​ఆర్టీసీ కార్గో సర్వీసుల ఛార్జీలు తగ్గిస్తూ ఆదేశాలు జారీ చేసింది. సరకు రవాణా మరింత విస్తరించేందుకు మరో అడుగు ముందుకేసింది. సరకు రవాణా ఏజెంట్లు ఆర్టీసీ కార్గో సర్వీస్‌లో బుక్‌చేయవచ్చని తెలిపింది. తమ వద్ద బుక్ చేస్తే నికర ఛార్జీపై 5 శాతం కమిషన్ ఇస్తామని ప్రకటించింది.

apsrtc reduces cargo charges
సరుకు రవాణా మరింత విస్తరణ... కార్గో సర్వీసులు ఛార్జీలు తగ్గింపు

By

Published : Nov 28, 2020, 10:20 PM IST

సరకు రవాణా మరింత విస్తరించేందుకు ఏపీఎస్​ఆర్టీసీ చర్యలకు తీసుకుంటుంది. ఛార్జీలు తగ్గిస్తూ ఆదేశాలు జారీ చేసింది. కార్గో ద్వారా చిరు వ్యాపారులు, రైతులు, తక్కువ సరకు రవాణా చేసేవారికి లబ్ధి చేకూరనున్నట్టు తెలిపింది. 100 కిలోమీటర్ల లోపు సరకు రవాణా ఛార్జీలు 50 శాతం వరకు సవరించిన ఆర్టీసీ... టన్నుకు 100 కిలోమీటర్ల లోపు రూ.1000 మాత్రమే వసూలు చేయనున్నట్టు ప్రకటించింది.

500 కిలోలకు 100 కిలోమీటర్ల లోపు వరకు రూ.500 మాత్రమే వసూలు చేయనున్నట్టు స్పష్టం చేసింది. 3 టన్నుల కనీస లోడు ఉంటే ప్రత్యేక వాహనం కేటాయిస్తామని తెలిపిన ​ఆర్టీసీ... సరకు రవాణాలో టోల్ ఛార్జీలు, జీఎస్టీ వసూలు ఉండవని తెలిపింది. సరకు రవాణా ఏజెంట్లు ఆర్టీసీ కార్గో సర్వీస్‌లో బుక్‌చేయవచ్చని తెలిపింది. తమ వద్ద బుక్ చేస్తే నికర ఛార్జీపై 5 శాతం కమిషన్ ఇస్తామని ప్రకటించింది. బుకింగ్‌ కోసం డిపోలు, సరకు రవాణా కౌంటర్లలో సంప్రదించాలని సూచించింది.

ABOUT THE AUTHOR

...view details