ఏఎస్ఆర్టీయూ నిర్వహించిన ఐటీ ఇన్ డిజటలైజేషన్ ఎక్సలెన్స్ అవార్డు పోటీల్లో ఏపీఎస్ఆర్టీసీ విజేతగా నిలిచింది. దేశంలో 64 ఆర్టీసీలు ఉండగా..వీటన్నింటినీ దాటుకుని ఐటీ ఆధారిత సేవల్లో ప్రథమ స్థానంలో నిలిచింది. తద్వారా మన ఆర్టీసీ దేశవ్యాప్త గుర్తింపు సాధించింది. ఐటీ ఆధారంగా ఆన్లైన్ ద్వారా టికెట్ల బుకింగ్, బస్సు రాకపోకల కచ్చిత సమయ వేళలను తెలియజేసేందుకు ఏపీఎస్ఆర్టీసీ లైవ్ ట్రాక్ సహా ఇతరత్రా మొబైల్ యాప్లు, సాంకేతిక సేవలు అందిస్తూ ప్రయాణికులకు మెరుగైన సేవలందిస్తోంది. ప్రయాణికుల మన్ననలు అందుకుంటూ సత్తా చాటింది. దిల్లీలో జరిగిన కార్యక్రమంలో ఆర్టీసీ ఈడీ ఎ.కోటేశ్వరరావు అవార్డును అందుకున్నారు.
అందులో.. దేశంలోని ఆర్టీసీల్లో మనమే నెంబర్ 1 - ఏపీఎస్ఆర్టీసీ ఐటీ అవార్డు న్యూస్
సాంకేతికతను వినియోగించి ప్రయాణికులకు మెరుగైన సేవలందించడంలో ఏపీఎస్ఆర్టీసీ మరోసారి సత్తా చాటింది. ఐటీ ఆధారిత సేవల్లో ఇప్పటికే పలు అవార్డులు సాధించిన ఆర్టీసీ... దేశంలోనే తొలి స్థానంలో నిలిచి ప్రత్యేకత చాటింది.
apsrtc received award about it services