ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

RTC for Rental Buses: అద్దె బస్సులకు ఆర్టీసీ ఆహ్వానం - అద్దెబస్సుల కోసం ఆర్టీసీ టెండర్లకు ఆహ్వానం న్యూస్

RTC Tender for Rental Buses: రాష్ట్రవ్యాప్తంగా 659 అద్దెబస్సుల కోసం ఆర్టీసీ టెండర్లకు ఆహ్వానించింది. ఆసక్తి ఉన్నవారు ఎంఎస్‌టీసీ ఈ-కామర్స్ పోర్టల్‌లో రిజిస్టర్‌ కావాలని ఆర్టీసీ ఈడీ వెల్లడించారు.

అద్దెబస్సుల కోసం ఆర్టీసీ టెండర్లకు ఆహ్వానం
అద్దెబస్సుల కోసం ఆర్టీసీ టెండర్లకు ఆహ్వానం

By

Published : Jul 6, 2022, 5:29 PM IST

రాష్ట్రవ్యాప్తంగా 659 అద్దె బస్సుల కోసం ఆర్టీసీ టెండర్లను ఆహ్వానించింది. జిల్లాలవారీగా వివిధ రకాల బస్సులు, సంఖ్య మేరకు టెండర్లు పిలిచింది. ఆసక్తి ఉన్నవారు ఎంఎస్‌టీసీ ఈ-కామర్స్ పోర్టల్‌లో రిజిస్టర్‌ కావాలని ఆర్టీసీ ఈడీ వెల్లడించారు. నేటి నుంచి ఈ నెల 27 వరకు బిడ్లు దాఖలు చేయవచ్చునని తెలిపారు.

టెండర్లకు ఆహ్వానించిన బస్సుల సంఖ్య

  • ఏసీ స్లీపర్ - 9
  • నాన్‌ ఏసీ స్లీపర్- 47
  • ఇంద్ర ఏసీ - 6
  • సూపర్ లగ్జరీ - 46
  • అల్ట్రా డీలక్స్ - 22
  • ఎక్స్‌ప్రెస్‌ - 70
  • అల్ట్రా పల్లెవెలుగు- 208
  • పల్లెవెలుగు - 203
  • మెట్రో ఎక్స్‌ప్రెస్ - 39
  • సిటీ ఆర్డినరీ బస్సులు - 9

ఇదీ చదవండి

For All Latest Updates

TAGGED:

RTC Tender

ABOUT THE AUTHOR

...view details