కరోనా వ్యాప్తి నివారణకు నగదు వినియోగాన్ని పూర్తిగా తగ్గించాలని ఆర్టీసీ నిర్ణయించింది. రాష్ట్రంలోని 12 వేలకుపైగా బస్సుల్లో టికెట్ బుకింగ్‌తోపాటు డిజిటల్ చెల్లింపుల కోసం 'ప్రథమ్' పేరుతో కొత్త యాప్‌ను ఈ నెలాఖరులోగా తీసుకురానుంది. ప్రయాణానికి ముందే టికెట్లు బుక్ చేసుకోవటం తప్పనిసరి చేసిన ఆర్టీసీ... ఇకపై ప్రథమ్ యాప్ ద్వారానే టికెట్ కొనేలా మార్పులు చేయనుంది. టికెట్ బుక్ చేసుకున్నప్పుడు వచ్చిన ఓటీపీని డ్రైవర్‌కు చెబితేనే ప్రయాణానికి అనుమతిస్తారు. యాప్‌లో వాలెట్ రీఛార్జీ చేసుకుంటే 5 శాతం రాయితీ పొందే అవకాశాన్ని కల్పించనున్నారు. మేలో ప్రారంభమైన ఆన్‌లైన్ బుకింగ్‌కు ప్రజల నుంచి వచ్చిన స్పందన దృష్ట్యా తాజా నిర్ణయం తీసుకున్నామని అధికారులు తెలిపారు.
ఇకపై మీరు బస్సెక్కితే.. కరెన్సీ తీసుకోరు.. డిజిటల్ చెల్లింపులే - టికెట్ బుకింగ్ కోసం ప్రథమ్ యాప్ వార్తలు
కరోనా వ్యాప్తి నివారణ కోసం బస్సుల్లో కరెన్సీ నోట్ల మార్పిడి వినియోగాన్ని పూర్తిగా పక్కన పెట్టాలనుకుంటోంది ఏపీఎస్ఆర్టీసీ. రాష్ట్రంలోని 12 వేలకు పైగా బస్సులన్నింటిలో సులువుగా బస్సు టికెట్ బుక్ చేసుకునే సదుపాయం కల్పించనుంది. ఈ నెలాఖరులోపు నూతన యాప్‌ను ఆర్టీసీ ప్రారంభించనుంది.
apsrtc introduce mobile app for tickets booking