ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

నేటి నుంచి ఆర్టీసీ దూరప్రాంత సర్వీసులు ప్రారంభం - ఏపీలో కర్ఫ్యూ

నేటి నుంచి ఆర్టీసీ దూరప్రాంత సర్వీసులు మళ్లీ ప్రారంభం కానున్నాయి. విజయవాడ నుంచి అటు విశాఖ వరకు, ఇటు ఒంగోలు, నెల్లూరు, తిరుపతికి సర్వీసులు ఉదయం 6-8 గంటల మధ్య బయలుదేరేలా సన్నాహాలు చేశారు. కర్ఫ్యూ సమయం సడలింపుతో ఈ నిర్ణయం తీసుకున్నారు.

APSRTC going to run long routes  again
APSRTC going to run long routes again

By

Published : Jun 11, 2021, 7:14 AM IST

Updated : Jun 11, 2021, 9:28 AM IST

రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం నుంచి కర్ఫ్యూ సమయాన్ని మధ్యాహ్నం రెండింటి వరకు సడలించడంతో ఏపీఎస్‌ఆర్టీసీ దూర ప్రాంత సర్వీసులు నడిపేలా నిర్ణయం తీసుకుంది. ఆర్టీసీ నడిపే బస్సు సర్వీసులూ పెంచనున్నారు. ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 2గంటల వరకు దూరప్రాంత బస్సులు తిప్పాలని అధికారులు నిర్ణయించారు.

నిర్ణీత సమయంలో గమ్యస్థానం చేరే దూరప్రాంత బస్సులు మాత్రమే నడపనున్నారు. మధ్యాహ్నం 2గంటల్లోగా గమ్యస్థానం చేరేలా బస్సులు నడపుతారు. విజయవాడ నుంచి అటు విశాఖ వరకు, ఇటు ఒంగోలు, నెల్లూరు, తిరుపతికి సర్వీసులు ఉదయం 6 గంటల నుంచి 8 గంటల మధ్య బయలుదేరేలా సన్నాహాలు చేశారు. కర్నూలు, నంద్యాలకు సైతం సర్వీసులు నడపనున్నారు.

Last Updated : Jun 11, 2021, 9:28 AM IST

ABOUT THE AUTHOR

...view details