RTC Employees Strike: పీఆర్సీ సాధన సమితి ఇచ్చిన పిలుపు మేరకు ఈనెల ఆరో తేదీ అర్ధరాత్రి నుంచి సమ్మెలో పాల్గొనేందుకు ప్రజా రవాణాశాఖ (ఆర్టీసీ) ఉద్యోగ సంఘాలు సిద్ధమవుతున్నాయి. అన్ని డిపోలు, యూనిట్ల వద్ద శని, ఆదివారాల్లో చేపట్టాల్సిన కార్యక్రమాలపై ఆర్టీసీ ఉద్యోగ సంఘాల ఐక్యవేదిక రాష్ట్ర కన్వీనర్లు వై.శ్రీనివాసరావు, పి.దామోదరరావు శుక్రవారం ఆదేశాలు జారీ చేశారు. ఈ రెండు రోజులు ఉద్యోగులు నల్ల బ్యాడ్జీలతో విధులకు హాజరుకావాలన్నారు. టీ, భోజన విరామ సమయాల్లో ధర్నాలు నిర్వహించాలని తెలిపారు. మరోవైపు సమ్మె అత్యవసర సేవల నిర్వహణ చట్టం-1971 ప్రకారం చట్టవ్యతిరేక చర్య కిందకు వస్తుందని ఆర్టీసీ ఎండీ ఉత్తర్వులు జారీచేశారు.
RTC: సమ్మెకు ఆర్టీసీ సంఘాలు సై.. నేడు, రేపు డిపోల వద్ద ధర్నాలు - RTC Employees Strike updates
RTC Employees Strike for PRC: పీఆర్సీ సాధన సమితి ఇచ్చిన పిలుపు మేరకు ఈనెల 6వ తేదీ అర్ధరాత్రి నుంచి సమ్మెలో పాల్గొనేందుకు ఏపీఎస్ఆర్టీసీ ఉద్యోగ సంఘాలు సిద్ధమవుతున్నాయి. అందులో భాగంగా.. నేడు, రేపు డిపోల వద్ద ధర్నాలు చేపట్టనున్నారు. ఈ నేపథ్యంలో ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై ఆర్టీసీ ఎండీ ఉత్తర్వులు జారీ చేశారు.
సమ్మెకు ఆర్టీసీ సంఘాలు
వీలైనన్ని బస్సులు నడపాలి
సమ్మె కాలంలో వీలైనన్ని ఎక్కువ బస్సులు నడపాలని.. అర్హులను డ్రైవర్లుగా, కండక్టర్లుగా తీసుకొని సేవలు వినియోగించుకోవాలని ఆర్టీసీ ఎండీ శుక్రవారం రాత్రి ఆదేశాలనిచ్చారు. హాజరైన సిబ్బంది, ప్రయాణికుల భద్రత, స్థానిక పరిస్థితులు తదితరాలన్నీ చూసుకొని వీలైనన్ని ఎక్కువ సర్వీసులు నడపాలి.
- డ్యూటీకి వచ్చేవారు అంగీకరిస్తే డబుల్ డ్యూటీలు చేయించాలి.
- ఏడీసీలు, కంట్రోలర్లు, డీసీలు, ట్రాఫిక్ ఇన్‌స్పెక్టర్లు, గ్రేడ్-3, ట్రాఫిక్ సూపర్‌వైజర్స్ ట్రైనీలను వారికి లైసెన్సు అర్హత ఉంటే డ్రైవర్లు, కండక్టర్లుగా వినియోగించుకోవాలి.
- అద్దె బస్సులను రెగ్యులర్ షెడ్యూల్స్‌లోనే కాకుండా అవసరాన్నిబట్టి ఇతర మార్గాల్లోనూ నడిపేందుకు వినియోగించాలి. బస్టాండ్లు, అవసరమైన చోట్ల గుర్తింపు పొందిన ఏజెంట్లు, ట్రాఫిక్ గైడ్స్ ద్వారా గ్రౌండ్ బుకింగ్‌కింద టిక్కెట్లు జారీచేస్తారు.
- కండక్టర్లు అందుబాటులో లేకపోయినాసరే అద్దె బస్సులన్నింటిని వాటి యజమానులు నడిపేలా చూడాలి.
ఇదీ చదవండి..
EMPLOYEES PROTEST: పీఆర్సీ జీవోలకు వ్యతిరేకంగా సచివాలయంలో పెన్ డౌన్