ఆదాయాన్ని సమకూర్చుకునేందుకు ఏపీఎస్ఆర్టీసీ సరికొత్త ఆలోచన చేసింది. బుక్ చేసిన వారి ఇంటికే కొరియర్ సేవలు అందించేందుకు ప్రణాళికలు రూపొందించింది. పార్సిళ్లను బస్టాండ్ వరకే పంపే వీలు ఉండగా పోస్టల్ శాఖ సహాయంతో డోర్ డెలివరీగా మార్చనుంది.
ఈ మేరకు ఇటీవల విజయవాడలో ప్రయోగాత్మకంగా అమలు చేసి.. రానున్న కాలంలో అన్ని జిల్లాల్లో డెలివరీ సేవలకు టెండర్ల ప్రక్రియ ద్వారా శ్రీకారం చుట్టనున్నట్లు ఆర్టీసీ అధికార వర్గాలు చెబుతున్నాయి. కరోనా కాలంలో కార్గో ద్వారా సుమారు 43 కోట్ల ఆదాయం రావడంతో ఆర్టీసీ ఈ తరహా సేవలపై దృష్టి సారించింది.