ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

ఆర్టీసీ బస్సుల్లో ఇక భౌతిక దూరం లేదు - ఏపీఎస్​ఆర్టీసీలో పూర్తిస్థాయి సీటింగ్ తాజా వార్తలు

బస్సుల్లో 50 శాతం సీట్లలోనే ప్రయాణికులను అనుమతించాలనే నిబంధన ఎత్తివేయాలని ఏపీఎస్ఆర్టీసీ నిర్ణయించింది. ఇకపై బస్సుల్లో పూర్తి స్థాయి సీటింగ్ సామర్థ్యంతో బస్సులు నడపనుంది.

బస్సుల్లో పూర్తిస్థాయి సీటింగ్ సామర్థ్యానికి ఏపీఎస్​ఆర్టీసీ అనుమతి
బస్సుల్లో పూర్తిస్థాయి సీటింగ్ సామర్థ్యానికి ఏపీఎస్​ఆర్టీసీ అనుమతి

By

Published : Sep 23, 2020, 5:30 AM IST

నష్టాలు వస్తోన్న దృష్ట్యా బస్సుల్లో ప్రయాణికులను అనుమతి విషయమై నిబంధనలను ఏపీఎస్​ఆర్టీసీ సడలించింది. ప్రభుత్వ ఆదేశాల మేరకు నూతన మార్గదర్శకాలను అమలు చేయాలని అన్ని జిల్లాల ఆర్​ఎంలకు ఎండీ కృష్ణబాబు ఆదేశాలు జారీ చేశారు. అన్ని దూరప్రాంత రిజర్వేషన్ సర్వీసుల్లో పూర్తి స్థాయిలో సీట్లలో ప్రయాణికులను అనుమతి ఇవ్వనుంది ఆర్టీసీ. పల్లెవెలుగు, సిటీ ఆర్డినరీ, మెట్రో ఎక్స్ ప్రెస్​లో దశలవారీగా పునరిద్ధరించాలని ఆదేశాల్లో తెలిపారు. ఈ మేరకు ఓపీఆర్​ఎస్​లో మార్పులు చేయాలని అన్ని జిల్లాల ఆర్ఎంలకు ఆర్టీసీ ఎండీ ఆదేశించారు.

లాక్​డౌన్​ అనంతరం మే 21 నుంచి అన్ని బస్సు సర్వీసులను పునరుద్ధరించిన ఆర్టీసీ.. కరోనా వ్యాప్తి చెందకుండా 50 శాతం లోపు సీట్లలో మాత్రమే ప్రయాణికులను అనుమతిస్తోంది. ఇకపై బస్సుల్లో ఆమోదించిన రిజిస్టర్డ్ సీటింగ్ సామర్థ్యం పునరుద్ధరణ చేస్తున్నట్లు ఆర్టీసీ తెలిపింది. రిజర్వేషన్ లేని పల్లెవెలుగు, సిటీ ఆర్డినరీ & మెట్రో ఎక్స్‌ప్రెస్‌లో రిజిస్టర్డ్ సీటింగ్ లేఅవుట్ దశలవారీగా పునరుద్ధరణ చేయనున్నట్లు ఆర్టీసీ ఎండీ కృష్ణబాబు తెలిపారు.

ప్రయాణికుల సౌలభ్యం కోసం గ్రౌండ్ బుకింగ్ పాయింట్లను ఏర్పాటు చేయాలని ఆర్టీసీ ఆదేశాల్లో తెలిపింది. బస్సులో వెళ్లే ప్రతీ ప్రయాణికుడు హ్యాండ్ శానిటైజర్ తప్పక వాడాలని ఆదేశించింది. ప్రయాణికులు, డ్రైవర్ , కండక్టర్లు తప్పక మాస్కులు ధరించాలని పేర్కొంది. బస్సుల్లో నిలబడి ప్రయాణించేందుకు అనుమతి లేదని.. బస్సుల్లోని సీట్లలో కూర్చుని మాత్రమే ప్రయాణించాలని స్పష్టం చేసింది. అన్ని బస్ స్టేషన్లలో పర్యవేక్షించడానికి ప్రత్యేకంగా అధికారులను నియమించాలని ఆర్టీసీ ఆదేశించింది.

ఇదీ చదవండి:డిక్లరేషన్​ ఇచ్చాకే జగన్ తిరుమలలో అడుగు పెట్టాలి: చంద్రబాబు

ABOUT THE AUTHOR

...view details