ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

ఉద్యోగార్థులకు ఏపీపీఎస్సీ తీపి కబురు

appsc-recruitment-tests-shedule-released
appsc-recruitment-tests-shedule-released

By

Published : Jun 22, 2020, 8:17 PM IST

Updated : Jun 23, 2020, 4:05 AM IST

20:16 June 22

పరీక్షలకు షెడ్యూల్‌ ప్రకటన

కరోనా వైరస్ ప్రభావంతో కొంతకాలం వాయిదా వేసిన ఉద్యోగ నియామక ప్రక్రియను తిరిగి ప్రారంభించాలని ఆంధ్రప్రదేశ్‌  పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌(ఏపీపీఎస్సీ) నిర్ణయించింది. విజయవాడలోని ఏపీపీఎస్సీ కార్యాలయంలో సోమవారం సమావేశమైన ఉన్నతాధికారులు... గతంలో నోటిఫికేషన్ విడుదల చేసి లాక్‌డౌన్ కారణంగా వాయిదా వేసి పలు పరీక్షలు  నిర్వహించాలని నిర్ణయించారు. రీ షెడ్యూల్ చేసిన పరీక్షల టైంటేబుల్‌ను ఏపీపీఎస్సీ కార్యదర్శి విడుదల చేశారు. సెప్టెంబర్ 15 నుంచి 27 వరకు గెజిటెడ్, నాన్ గెజిటెడ్ ఉద్యోగ నియామక పరీక్షలు నిర్వహించనున్నారు. నవంబర్2 నుంచి 13 వరకూ గ్రూప్-1 ఉద్యోగ నియామక పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించారు.

  1. సెప్టెంబర్ 15, 16 తేదీల్లో డిగ్రీ కళాశాల లెక్చరర్ల నియామక పరీక్షలు
  2. సెప్టెంబర్ 21, 22, 23, 24 తేదీల్లో గెజిటెడ్ ఉద్యోగాల నియామక పరీక్షలు
  3. సెప్టెంబర్ 21, 22 అసిస్టెంట్ బీసీ/సోషల్/ట్రైబర్ వెల్ఫేర్ ఆఫీసర్ ఉద్యోగ నియామక పరీక్షలు
  4. సెప్టెంబర్ 22 న రాయల్టీ ఇన్‌స్పెక్టర్ ఇన్ మైనింగ్ సర్వీస్ ఉద్యోగ నియామక పరీక్ష
  5. సెప్టెంబర్ 23న సివిల్ అసిస్టెంట్ సర్జన్ ఉద్యోగాల నియామక పరీక్ష
  6. సెప్టెంబర్ 23న పోలీసు విభాగంలో టెక్నికల్ అసిస్టెంట్ ఉద్యోగాల నియామక పరీక్ష
  7. సెప్టెంబర్ 23, 24 పట్టణ ప్రణాళిక విభాగంలో అసిస్టెంట్ డైరెక్టర్ పోస్టుల భర్తీకి నియామక పరీక్ష
  8. సెప్టెంబర్ 23, 24 ఏపీ గ్రౌండ్ వాటర్ విభాగంలో అసిస్టెంట్ కెమిస్ట్ ఉద్యోగాల నియామక పరీక్ష
  9. సెప్టెంబర్ 23,24 పట్టణ ప్రణాళిక విభాగంలో టౌన్‌ప్లానింగ్ అసిస్టెంట్ ఉద్యోగ నియామక పరీక్ష
  10. సెప్టెంబర్ 25, 26, 27 తేదీల్లో నాన్ గెజిటెడ్ ఉద్యోగాల నియామక పరీక్షలు
  11. సెప్టెంబర్ 25, 26, 27 ఏపీ గ్రౌండ్ వాటర్ విభాగంలో టెక్నికల్ అసిస్టెంట్ ఉద్యోగ పరీక్షలు
  12. సెప్టెంబర్ 26న వెల్ఫేర్ ఆర్గనైజర్ ఉద్యోగాల నియామక పరీక్ష
  13. సెప్టెంబర్ 26, 27 తేదీల్లో జిల్లా సైనిక్ వెల్ఫేర్ ఆఫీసర్ల నియామక పరీక్ష
  14. సెప్టెంబర్ 26, 27తేదీల్లో ఆర్కియాలజీ, మ్యూజియంలో టెక్నికల్ అసిస్టెంట్స్ పరీక్ష
  15. సెప్టెంబర్ 27 మైన్స్, జియాలజీ విభాగంలో టెక్నికల్ అసిస్టెంట్ ఉద్యోగ నియామక పరీక్ష
  16. సెప్టెంబర్ 27 న డిప్యూటీ ఇన్‌స్పెక్టర్ ఆఫ్ సర్వే ఉద్యోగాల నియామక పరీక్ష
  17. నవంబర్ 2 నుంచి 13 వరకు గ్రూప్-1 ఉద్యోగాల నియామక పరీక్ష

ఎక్కడా ఎలాంటి అవకతవకలకు ఆస్కారం లేకుండా ఉద్యోగ నియామక పరీక్షలకు ఏర్పాట్లు చేయాలని ఏపీపీఎస్సీ కార్యదర్శి ఆంజనేయులు అధికారులను ఆదేశించారు. 

 

Last Updated : Jun 23, 2020, 4:05 AM IST

ABOUT THE AUTHOR

...view details