గ్రూప్-2 స్క్రీనింగ్ ఫలితాల విడుదల - uday bhaskar
రాష్ట్ర పబ్లిక్ సర్వీసు కమిషన్ నిర్వహించిన గ్రుప్-2 పరీక్షల స్క్రీనింగ్ ఫలితాలు విడుదలయ్యాయి. అర్హుల వివరాలు.. కమిషన్ వెబ్సైట్లో ఉన్నాయి.
గ్రూప్ - 2 స్క్రీనింగ్ పరీక్షలు ఫలితాలను ఏపీపీఎస్సి విడుదల చేసింది. వైబ్సైట్లో అభ్యర్థుల మెరిట్ జాబితాను అందుబాటులోకి తెచ్చింది. గత సంవత్సరం డిసెంబరు 31వ తేదీన 446 పోస్టులకు.... గ్రూప్-2 పరీక్షల నోటిఫికేషన్ విడుదల చేసింది. మే 5న స్క్రీనింగ్ పరీక్ష నిర్వహించారు. తాజా ఫలితాల్లో... ఓసీ, బీసీ అభ్యర్థులకు 81.20 మార్కులను కటాఫ్‌గా నిర్ణయించారు. ఎస్సీలకు 78.37, ఎస్టీలకు 69.15.. బీసీ సీ విభాగంలో ఉన్న వారికి 66.67 మార్కులుగా నిర్ణయించారు. ప్రధాన పరీక్ష కు 6వేల 195 మంది అభ్యర్థులను ఎంపిక చేశారు. పరీక్ష సమయంలో చేసిన పొరపాట్ల కారణాలతో 726 మంది అభ్యర్థులను తిరస్కరించినట్లు ఏపీపీఎస్సి పేర్కొంది.1:12నుంచి1:15 నిష్పత్తిలో అభ్యర్థులను ఎంపిక చేసింది. ఓపెన్ కేటగిరీలో 5,540 అభ్యర్థులు ఎంపిక కాగా బీసీ-సి లో 83, బీసీ-ఈ లో 77, ఎస్సీల్లో 215, ఎస్టీల్లో 195 మందిని ఎంపిక చేసింది.మెయిన్స్ పరీక్షను ఆగస్టు 29,30 తేదీల్లో నిర్వహించనుంది.