ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

గవర్నర్​తో ఏపీపీఎస్సీ ఛైర్మన్ భేటీ.. గ్రూప్-1 వివాదంపై చర్చ ! - గవర్నర్​తో ఏపీపీఎస్సీ ఛైర్మన్ భేటీ వార్తలు

APPSC chairman meet Governor: ఏపీపీఎస్సీ ఛైర్మన్ గౌతమ్ సవాంగ్, ఇతర సభ్యులు రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్​తో సమావేశమయ్యారు. 2018 గ్రూప్-1 పరీక్షల డిజిటల్ మాన్యువల్ వాల్యుయేషన్ వివాదంపై.. గవర్నర్​కు ఏపీపీఎస్సీ చైర్మన్ వివరించినట్లు తెలుస్తోంది.

గవర్నర్​తో ఏపీపీఎస్సీ ఛైర్మన్ భేటీ
గవర్నర్​తో ఏపీపీఎస్సీ ఛైర్మన్ భేటీ

By

Published : Jun 3, 2022, 3:20 PM IST

ఏపీపీఎస్సీ ఛైర్మన్ గౌతమ్ సవాంగ్, ఇతర సభ్యులు రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్​తో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఏపీపీఎస్సీ రూపొందించిన సిలబస్​తో పాటు ఇతర మాన్యువల్స్​ను గవర్నర్ ఆవిష్కరించారు. 2018 గ్రూప్-1 పరీక్షల డిజిటల్ మాన్యువల్ వాల్యుయేషన్ వివాదంపైనా.. గవర్నర్​కు ఏపీపీఎస్సీ చైర్మన్ వివరించినట్లు తెలుస్తోంది.

మరోవైపు గ్రూప్-1 వాల్యుయేషన్​ వివాదంపై అభ్యర్థులు గవర్నర్​కు ఫిర్యాదు చేశారు. మెయిన్స్ పరీక్షా పత్రాల మూల్యాంకనంలో తమకు అన్యాయం జరిగినందున ఈ వ్యవహారంపై సీబీఐతో విచారణ జరిపించాలని కోరారు. అధికారుల నిర్ణయం వల్ల తమ భవిష్యత్తును కోల్పోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ఏపీపీఎస్సీ అధికారులు మారితే ఫలితాలు ఎలా మారతాయని అభ్యర్థులు ప్రశ్నించారు. జవాబు పత్రాలు మార్చటం వెనుక కారణం ఏమిటని ప్రశ్నించారు. గతంలో 326 మందిని ఇంటర్వ్యూకి పిలిచి.., ప్రస్తుతం 202 మందిని ఆ జాబితా నుంచి తొలగించారన్నారు. 55 వేల సమాధాన పత్రాలను 35 రోజుల్లో ఎలా దిద్దారని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఈ వ్యవహారంపై పూర్తి విచారణ జరిపించి న్యాయం చేస్తామని గవర్నర్ హామీ ఇచ్చారని అభ్యర్థులు తెలిపారు.

ఇవీ చూడండి

ABOUT THE AUTHOR

...view details