ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

రెమిడెసివిర్ వినియోగం, విక్రయాలపై ప్రత్యేక నోడల్ అధికారుల నియామకం - రెమిడెసివిర్ విక్రయం పై నోడల్ అధికారుల నియామకం

రెమిడెసివిర్ ఔషధ వినియోగం, విక్రయాలపై ప్రభుత్వం.. ప్రత్యేక నోడల్ అధికారులను నియమించినట్లు ఏపీ కొవిడ్ నోడల్ అధికారి డా. ఆర్జ శ్రీకాంత్ తెలిపారు.

రెమిడెసివిర్ వినియోగం, విక్రయాలపై ప్రత్యేక నోడల్ అధికారుల నియామకం
రెమిడెసివిర్ వినియోగం, విక్రయాలపై ప్రత్యేక నోడల్ అధికారుల నియామకం

By

Published : Apr 25, 2021, 9:21 PM IST

రెమిడెసివిర్ ఔషధ వినియోగం, విక్రయాలపై ప్రభుత్వం.. ప్రత్యేక నోడల్ అధికారులను నియమించినట్లు ఏపీ కొవిడ్ నోడల్ అధికారి డా. ఆర్జ శ్రీకాంత్ తెలిపారు. కొవిడ్ రోగుల చికిత్సలో రెమిడెసివిర్ కీలకంగా పనిచేస్తున్నందున.. అత్యవసర పరిస్థితుల్లో ఈ ఔషధాన్ని వినియోగిస్తున్నారన్నారు. ప్రస్తుతం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరగటంతో ఈ ఔషదానికి డిమాండ్ పెరిగిందన్నారు. ప్రైవేట్ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న రోగులకు వైద్యులు రెమిడెసివిర్​ను సిఫార్సు చేస్తున్నారని, అయితే మార్కెట్​లో రెమిడెసివిర్ నిల్వలు లేకపోవటంతో రోగుల బంధువుల ఆందోళన చెందుతున్నారని అన్నారు. దీంతో అధికారులు... జిల్లా డ్రగ్​ అధికారిని జిల్లా నోడల్ అధికారిగా నియమించామన్నారు. నోడల్ అధికారులు ఈ ఔషధ విక్రయాలు, స్టాకు పై దృష్టి పెట్టనున్నారని... ప్రైవేట్ ఆసుపత్రుల్లో వైద్యులు సిఫార్సు చేస్తే రోగుల ఆరోగ్య స్థితి ఆధారంగా వారికి ఔషధం అందేలా చర్యలు తీసుకుంటారని కొవిడ్ కంట్రోల్ రూం నోడల్ అధికారి డా. ఆర్జ శ్రీకాంత్ తెలిపారు.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details