ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

ఏబీ వెంకటేశ్వరరావుపై మోపిన అభియోగాలపై విచారణ అధికారి నియామకం - Appointment of an investigating officer on AB Venkateswara Rao case news

ఏబీ వెంకటేశ్వరరావుపై మోపిన అభియోగాలపై విచారణ అధికారిని నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. సెక్షన్ 8 కింద నమోదైన అభియోగాలపై కమిషనర్ ఆఫ్ ఇంక్వైరీస్ ఆర్పీ సిసోడియా విచారణ చేయనున్నారు.

Appointment of an investigating officer on AB Venkateswara Rao case
ఏబీ వెంకటేశ్వరరావుపై మోపిన అభియోగాలపై విచారణ అధికారి నియామకం

By

Published : Jul 27, 2021, 7:03 PM IST

ఏబీ వెంకటేశ్వరరావుపై మోపిన అభియోగాలపై విచారణ అధికారిని నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కమిషనర్ ఆఫ్ ఇంక్వైరీస్ ఆర్పీ సిసోడియాను విచారణ అధికారిగా నియమిస్తూ సీఎస్‌ ఆదిత్యనాథ్ దాస్ ఈ మేరకు ఆదేశాలిచ్చారు. అఖిలభారత సర్వీసు క్రమశిక్షణా నిబంధనల్లోని సెక్షన్ 8 కింద నమోదైన అభియోగాలపై ఆర్పీ సిసోడియా విచారణ చేయనున్నారు.

విచారణాధికారి ముందు ఏబీవీపై నమోదైన అభియోగాలపై వాదనకు ప్రభుత్వ తరఫు న్యాయవాదిని నియమిస్తూ ఆదేశాలు జారీ అయ్యాయి. మరోవైపు అఖిలభారత సర్వీసు నిబంధనల్లో క్రమశిక్షణ ఉల్లంఘన కింద నమోదైన అభియోగాలకు సంబంధించిన వివరణను నిర్ణీత సమయంలోగా విచారణాధికారికి సమర్పించాలంటూ ఏబీ వెంకటేశ్వరరావును ప్రభుత్వం ఆదేశించింది.

For All Latest Updates

TAGGED:

ab case

ABOUT THE AUTHOR

...view details