ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

340 మొబైల్ వెటర్నరీ క్లినిక్​లు ప్రారంభిస్తాం: మంత్రి అప్పలరాజు - మంత్రిగా అప్పలరాజు బాధ్యతలు

ఈనెల 28న 340 మొబైల్ వెటర్నరీ క్లినిక్‌లు ప్రారంభిస్తామని మంత్రి సీదిరి అప్పలరాజు స్పష్టం చేశారు. పశుసంవర్ధకం, మత్స్యశాఖ మంత్రిగా సచివాలయంలో బాధ్యతలు చేపట్టిన ఆయన.. పాలవెల్లువలో భాగంగా పలు యూనిట్ల ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్నామన్నారు.

ఈనెల 28న 340 మెుబైల్ వెటర్నరీ క్లినిక్​లు ప్రారంభిస్తాం
ఈనెల 28న 340 మెుబైల్ వెటర్నరీ క్లినిక్​లు ప్రారంభిస్తాం

By

Published : Apr 14, 2022, 3:31 PM IST

ప్రభుత్వ విధానాల్లో మంత్రులకు ఏమాత్రం స్వాతంత్య్రం లేకుండా అన్నీ ముఖ్యమంత్రే పర్యవేక్షిస్తారంటూ తెదేపా చేస్తున్న ఆరోపణల్లో వాస్తవం లేదని మంత్రి సీదిరి అప్పలరాజు స్పష్టం చేశారు. పాదయాత్రలో భాగంగా అన్ని ప్రాంతాలు తిరిగి.., అన్ని వర్గాలను కలిసిన వ్యక్తిగా ముఖ్యమంత్రికి అన్ని అంశాలపైనా అవగాహన ఉందని అన్నారు. పశుసంవర్థక, మత్స్యశాఖ మంత్రిగా రెండోసారి బాధ్యతలు చేపట్టిన ఆయన.. ఈ నెల 28న 340 మొబైల్ వెటర్నరీ క్లినిక్​లను ప్రారంభిస్తున్నట్టు తెలిపారు. అమూల్ పాలవెల్లువ కార్యక్రమంలో భాగంగా మహిళలకు ఆటోమేటెడ్ చిల్లింగ్ యూనిట్లు, బల్క్ మిల్క్ చిల్లింగ్ యూనిట్లను త్వరలోనే ఇవ్వనున్నట్లు తెలియచేశారు.

మరోవైపు రాష్ట్రంలో 9 హార్బర్లు, 4 ఫిషింగ్ జెట్టీలు మంజూరు అయ్యాయని.. జువ్వలదిన్నె, ఉప్పాడ, మచిలీపట్నం, నిజాంపట్నం ఫిషింగ్ హార్బర్ల నిర్మాణం వేగంగా జరుగుతోందని మంత్రి అప్పలరాజు స్పష్టం చేశారు. బియ్యపుతిప్ప, వాడ్రేవు, కొత్తపట్నం, పూడిమడక ఫిషింగ్ హార్బర్లు టెండర్ ప్రక్రియలో ఉన్నాయన్నారు. ఆక్వా రైతులకు విద్యుత్ రాయితీ విషయంలో గత ప్రభుత్వం మోసం చేసిందన్నారు. ప్రస్తుతం ఆక్వా రైతులకు 1.50 రూపాయలకు యూనిట్ చొప్పున విద్యుత్ సరఫరా చేస్తున్నామని వివరించారు.రూ.1912 కోట్ల మేర విద్యుత్ సబ్సిడీగా ఇప్పటి వరకూ ఇచ్చినట్లు తెలిపారు. ప్రత్యేక పరిస్థితుల దృష్ట్యా.. 5 ఎకరాల వరకు ఆక్వా సాగు చేసే రైతులకు మాత్రమే రూ.1.50 విద్యుత్ సబ్సీడీ కొనసాగించాలని నిర్ణయించామని స్ఫష్టం చేశారు. అంతకంటే ఎక్కువ విస్తీర్ణంలో ఆక్వా సాగు చేస్తున్న రైతులకు మాత్రం యూనిట్​కు రూ.3.50 చొప్పున వసూలు చేయాలని నిర్ణయించినట్లు వివరించారు.

ఇదీ చదవండి: ఏలూరు ఘటనపై సీఎం జగన్‌ దిగ్భ్రాంతి..మృతుల కుటుంబాలకు రూ.25లక్షలు ఎక్స్​గ్రేషియా

ABOUT THE AUTHOR

...view details