ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

ప్రవాసాంధ్ర మృతుల కుటుంబాలకు ఏపీఎన్​ఆర్టీఎస్​ ఆర్థిక సాయం - ప్రవాసాంధ్రులకు ఎపీఎన్​ఆర్టీఎస్​ సేవలు

ప్రవాసాంధ్రుల కోసం ఏపీఎన్​ఆర్టీఎస్​... వివిధ సేవలందిస్తున్నట్లు సంస్థ అధ్యక్షులు వెంకట్ ఎస్. మేడపాటి తెలిపారు. విదేశాల్లో మరణించిన 36 మంది కుటుంబాలకు.. రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో రూ. 50 వేల చొప్పున ఆర్థిక సాయం అందిచినట్లు వెల్లడించారు. సంస్థ ద్వారా సహాయం పొందేందుకు ప్రవాసాంధ్రులు తమను సంప్రదించవచ్చని వెల్లడించారు.

apnrts help to state nri families
ప్రవాసాంధ్ర మృతుల కుటుంబాలకు ఏపీఎన్​ఆర్టీఎస్​ ఆర్థిక సాయం

By

Published : Feb 27, 2021, 6:26 AM IST

విదేశాల్లో మరణించిన ఆంధ్రుల కుటుంబాలకు.. ఏపీ ప్రవాసాంధ్ర సొసైటీ.. ఎక్స్​గ్రేషియా రూపంలో ఆర్థిక సహాయం అందిస్తోంది. 36 బాధిత కుటుంబాలు ఒక్కొక్కరికి రూ. 50,000 చొప్పున.. రాష్ట్ర ప్రభుత్వం తరఫున నగదు పంపిణీ చేసింది. సమగ్ర వలస సంక్షేమ విధానం ద్వారా నిరాశ్రయులు, నిస్సహాయులైన వలసదారుల కోసం వివిధ సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నట్లు సొసైటీ అధ్యక్షులు వెంకట్ ఎస్. మేడపాటి పేర్కొన్నారు. ఏపీఎన్ఆర్టీ సొసైటీ నుంచి సాయం పొందేందుకు దరఖాస్తు ఫారం, మృతుడు, నామినీ వివరాలు, భారత దౌత్యకార్యాలయంతో పాటు స్థానిక తహసీల్దార్ ఇచ్చిన ధ్రువీకరణ పత్రాలు సమర్పించాల్సి ఉంటుందన్నారు.

ఆ దరఖాస్తులను క్షుణ్ణంగా పరిశీలించిన అనంతరం.. నిర్ణీత అర్హత ప్రమాణాలను పూర్తిచేసిన వారికి ఆర్థిక సహాయాన్ని అందిస్తామని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో.. ప్రవాసాంధ్రుల కోసం సంక్షేమ కార్యక్రమాలు చేపట్టడంలో తమ సంస్థ ఎప్పుడూ ముందుంటుందని ఆయన తెలిపారు. 2019 జూన్ నుంచి ఇప్పటి వరకు 200 మంది బాధిత కుటుంబాలకు.. సుమారు రూ. కోటి అందించినట్లు పేర్కొన్నారు. తమ సేవల గురించి మరింత సమాచారం కోసం వెబ్‌సైట్‌ www.apnrts.ap.gov.in ను లేదా 24/7 హెల్ప్‌లైన్‌ 0863 2340678, 8500027678ను సంప్రదించవచ్చని మేడపాటి సూచించారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details