APNGOs on CPS: సీపీఎస్ రద్దు కోసం పోరాడుతున్న ఉద్యోగులపై రాష్ట్ర ప్రభుత్వ వేధింపులు, బెదిరింపులు, బైండోవర్ చేయడం తగదని ఏపీఎన్జీవో హితవు పలికింది. ఉద్యోగులపై ప్రభుత్వం పెట్టిన కేసులు తక్షణమే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేసింది. సెప్టెంబర్ 1న విద్రోహ దినంగా పాటిస్తామని స్పష్టం చేసింది. సీఎం జగన్ ఇంటి ముట్టడి కార్యక్రమాన్ని విరమించుకున్నా అరెస్ట్ చేయడం అన్యాయమని.. రేపు కలెక్టరేట్ వద్ద నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలుపుతామని వెల్లడించింది. సీపీఎస్ రద్దు చేసేవరకు పోరాటం ఆగదని ఎన్జీవో సంఘం స్పష్టం చేసింది. సీఎం ఇచ్చిన హామీ నెరవేర్చకపోతే ఉద్యమం తప్పదని ఎన్జీవో సంఘ నేతలు హెచ్చరించారు. సీపీఎస్‌ను రద్దు చేయాలంటూ ఉద్యోగులు తలపెట్టిన ‘చలో విజయవాడ’ కార్యక్రమం సెప్టెంబర్ 11కి వాయిదా పడిన విషయం తెలిసిందే.
సెప్టెంబర్ 1 విద్రోహ దినం.. కలెక్టరేట్‌ల వద్ద నల్ల బ్యాడ్జీలతో నిరసన: ఏపీఎన్జీవో - APNGO BLACK DAY
APNGO PROTEST ON SEPTEMBER 1ST: ఉద్యోగుల అక్రమ నిర్బంధాలకు నిరసనగా సెప్టెంబర్ 1న విద్రోహ దినంగా పాటిస్తామని ఏపీఎన్జీవో ప్రకటించింది. సీఎం ఇంటి ముట్టడి కార్యక్రమాన్ని విరమించినా అరెస్టు చేయటం అన్యాయమని మండిపడింది. ఉద్యోగులపై పెట్టిన కేసులు ఉపసంహరించుకోవాలని ఎన్జీవో నేతలు డిమాండ్ చేశారు.
శ్రీకాకుళం జిల్లాలో 12 మంది ఉద్యోగ సంఘ నేతలు, 200 మంది ఉద్యోగులపై బైండోవర్ కేసులు పెట్టారని ఉద్యోగులు మండిపడ్డారు. ప్రభుత్వం ఎన్ని కేసులు పెట్టినా వెనకడుగు వేసేది లేదన్నారు. పాదయాత్రలో జగన్ ఇచ్చిన హామీ మేరకు సీపీఎస్ రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఉద్యోగులు, ఉపాధ్యాయులపై పోలీసుల వేధింపులు ఆపాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ డిమాండ్ చేశారు. తాడేపల్లి పరిసరాల్లో ముళ్లకంచెలు, పోలీసు ఆంక్షలు ఎందుకని ప్రశ్నించారు. అదేమన్నా నిషేధిత ప్రాంతమా అని నిలదీశారు. సీపీఎస్ రద్దుపై పోరులో ఉద్యోగులకు సీపీఐ మద్దతు ఉంటుందని తెలిపారు.
ఇవీ చదవండి: