ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

'ఆ సంస్థకు ఇవ్వడం వల్లే ఉద్యోగాలు పోయాయి' - విజయవాడ తాజా వార్తలు

ఇసుక రీచ్​లలో విధుల నుంచి తొలగించడంపై విజయవాడ ధర్నా చౌక్​ వద్ద ఒప్పంద ఉద్యోగులు ధర్నా చేపట్టారు. కొత్తగా ఓ ప్రైవేట్ సంస్థకు ఇసుక రీచ్​లు అప్పగించడంతో ఉద్యోగాల నుంచి తొలగించారని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే తిరిగి విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు.

apmdc employees dharna
ఒప్పంద ఉద్యోగుల ధర్నా

By

Published : Jun 28, 2021, 5:00 PM IST

ఇసుక రీచ్​లలో విధుల నుంచి తొలగించిన 1922 మందిని ఏపీఎండీసీ ద్వారా ఆప్కాస్​లో కొనసాగించాలని డిమాండ్ చేస్తూ.. విజయవాడ ధర్నా చౌక్​ వద్ద ఒప్పంద ఉద్యోగులు ధర్నాకు దిగారు. ఇటీవల ప్రభుత్వం ఇసుక రీచ్​లను ఓ ప్రైవేట్ సంస్థకు కేటాయించింది. దీంతో వారు తమను ఉద్యోగాల్లో నుంచి అర్ధాంతరంగా తొలగించారని ఉద్యోగులు ఆందోళన ఆవేదన వ్యక్తం చేశారు. తమ ఉద్యోగ స్థానాల్లో బయటి వ్యక్తులను కేటాయించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సంస్థలు మారినా ఉద్యోగులను మార్చిన ఘటనలు గత 20 సంవత్సరాల్లో ఇదే ప్రథమమని ఉద్యోగులు అన్నారు. తొలగించిన వారిని వెంటనే తిరిగి విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు.

ఇదీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details