ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

ఏప్రిల్ 10 నుంచి రాజధానిలో ఏపీ ఎమ్మార్పీఎస్ నిరసన - APMARPS Latest News

అమరావతినే ఏకైక రాజధానిగా కొనసాగించాలని రాష్ట్ర ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు పెరుపోగు వెంకటేశ్వరరావు డిమాండ్ చేశారు. 85 రోజులుగా రాజధాని ప్రాంత రైతులు, మహిళలు చేస్తున్న నిరసనలను.. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పట్టించుకోకపోవడం దారుణమన్నారు.

ఏపీ ఎమ్మార్పీఎస్​ ముఖ్య నేతల సమావేశం
ఏపీ ఎమ్మార్పీఎస్​ ముఖ్య నేతల సమావేశం

By

Published : Mar 11, 2020, 3:53 PM IST

మీడియాతో మాట్లాడుతున్న ఏపీ ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు పెరుపోగు వెంకటేశ్వరరావు

రాష్ట్ర ఏకైక రాజధానిగా అమరావతినే కొనసాగించాలని ఏపీ ఎమ్మార్పీఎస్​ అధ్యక్షుడు పెరుపోగు వెంకటేశ్వరరావు డిమాండ్​ చేశారు. వికేంద్రీకరణ పేరుతో కొంతమందితో ప్రతీకార చర్యలకు పాల్పడే విధంగా దీక్షలు చేయించడం దారుణమన్నారు. ప్రధాని మోదీ రాజధానికి శంకుస్థాపన చేసిన ప్రదేశంలో ఏప్రిల్ 10 నుంచి నిరసన దీక్ష చేయనున్నట్లు వెల్లడించారు. ఎస్సీ వర్గీకరణపై వైకాపా ప్రభుత్వం అసెంబ్లీలో ఏకగ్రీవ తీర్మానం చేయాలని డిమాండ్ చేశారు.

మళ్లించిన నిధులను ఎస్సీ కార్పొరేషన్​కు తక్షణమే కేటాయించాలన్నారు. రాయలసీమ, ఉత్తరాంధ్ర ప్రాంతాలకు విభజన చట్టంలోని ప్రత్యేక ప్యాకేజీ అమలు చేయాలని డిమాండ్​ చేశారు. సీఏఏ, ఎన్​ఆర్సీ, ఎన్పీఆర్​​లను అమలు చేయబోమని అసెంబ్లీలో తీర్మానం చేయాలన్నారు. లేదంటే ఏప్రిల్ 20వ తేదీన అన్ని జిల్లాల కలెక్టరేట్లను ముట్టడిస్తామని హెచ్చరించారు. అన్ని జిల్లాల ముఖ్య నేతలతో ఏపీ ఎమ్మార్పీఎస్​ రాష్ట్ర కార్యాలయంలో ఆయన సమావేశమయ్యారు.

ABOUT THE AUTHOR

...view details