కేంద్ర ప్రభుత్వ పథకాలను అనుసంధానం చేస్తూ ఆటోనగర్‌లు..పారిశ్రామిక వాడలను అభివృద్ధి చేస్తామని ఏపీఐఐసీ వైస్‌ఛైర్మన్ కె.రవీణ్‌కుమార్‌రెడ్డి తెలిపారు. స్వచ్ఛ సర్వేక్షన్‌లో భాగంగా విజయవాడ ఆటోనగర్‌లో ఆయన పర్యటించారు. ఏపీఐఐసీ జోనల్ కార్యాలయం నుంచి ఆటోనగర్ తదితర ప్రాంతాల్లో ఐలా ప్రతినిధులతో కలిసి పరిశీలించారు. పారిశుధ్యం మెరుగు, మౌలిక వసతుల కల్పన, రహదారుల నిర్మాణం, అవసరమైన చోట్ల విద్యుత్తు సదుపాయాలు మెరుగుదల తదితర కార్యక్రమాల నిర్వహణ కోసం త్వరలోనే సమగ్ర మాస్టర్‌ప్లాన్ రూపొందించబోతున్నట్లు తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ఎంఎస్ఎంఈ పథకం కింద నిధులు సమకూరుస్తోందని.. కొత్త పారిశ్రామిక పార్కులను ప్లగ్ అండ్ ప్లే నమూనాలో ఏర్పాటు చేస్తామన్నారు.
'నగర అభివృద్ధి కోసం త్వరలోనే సమగ్ర మాస్టర్‌ప్లాన్' - కృష్ణా జిల్లా తాజా వార్తలు
ఆటోనగర్‌లు, పారిశ్రామిక వాడల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వ పథకాలను అనుసంధానం చేస్తామని ఏపీఐఐసీ వైస్‌ఛైర్మన్ కె.రవీణ్‌కుమార్‌రెడ్డి వెల్లడించారు. స్వచ్ఛ సర్వేక్షన్‌లో భాగంగా ఐలా ప్రతినిధులతో కలిసి విజయవాడ ఆటోనగర్‌లో ఆయన పర్యటించారు. నగరంలో అభివృద్ధి కార్యక్రమాల కోసం త్వరలోనే సమగ్ర మాస్టర్‌ప్లాన్ రూపొందించబోతున్నట్లు ఆయన పేర్కొన్నారు.

ఏపీఐఐసీ వైస్‌ఛైర్మన్ కె.రవీణ్‌కుమార్‌రెడ్డి