APIIC Chairman: ప్రభుత్వం చెల్లించే గౌరవ వేతనం తనకు వద్దంటూ ఏపీఐఐసీ (APIIC)ఛైర్మన్ మెట్టు గోవిందరెడ్డి ఆర్థిక శాఖకు లేఖ రాశారు. ఏపీఐఐసీ ద్వారా తనకు వచ్చే వేతనాన్నితిరిగి ఖజానాకు జమ చేస్తున్నట్టు ఆ లేఖలో పేర్కొన్నారు. ప్రజలకు సేవ చేసేందుకు వచ్చిన తనకు.. గౌరవ వేతనం అవసరం లేదని లేఖలో స్పష్టం చేశారు. అయితే రాష్ట్రంలోని అన్ని కార్పొరేషన్లు, సంస్థల ఛైర్మన్‌ల వేతనాలపై ప్రభుత్వం ఇటీవల సీలింగ్ విధించింది. వేతనాలు 65 వేల రూపాయలు మించరాదని పేర్కోంది. ఇటీవలి వరకూ ఏపీఐఐసీ ఛైర్మన్‌కు ఆర్ కేటగిరీ హోదాను ప్రభుత్వం కల్పించింది. వేతనంతో కలిపి ఇతర సౌకర్యాలకుగానూ 3లక్షల 82వేల రూపాయల వరకూ చెల్లించేవారు. కానీ ప్రభుత్వం కార్పొరేషన్ ఛైర్మన్ గౌరవ వేతనాలపై సీలింగ్ విధించటంతో ఒక్కసారిగా ఏపీఐఐసీ ఛైర్మన్ వేతనం రూ.65 వేలకు తగ్గింది.
APIIC Chairman: నాకు గౌరవ వేతనం అవసరం లేదు.. ఆర్థికశాఖకు ఏపీఐఐసీ ఛైర్మన్ లేఖ - ప్రభుత్వం చెల్లించే గౌరవ వేతనం వద్దంటూ ఆర్థిక శాఖకు ఏపీఐఐసీ ఛైర్మన్ లేఖ
APIIC Chairman: ఏపీఐఐసీ (APIIC)ఛైర్మన్ మెట్టు గోవిందరెడ్డి ఆర్థిక శాఖకు లేఖ రాశారు. ప్రభుత్వం చెల్లించే గౌరవ వేతనం తనకు వద్దంటూ ఆ లేఖలో పేర్కొన్నారు.
ప్రభుత్వం చెల్లించే గౌరవ వేతనం వద్దంటూ ఆర్థిక శాఖకు ఏపీఐఐసీ ఛైర్మన్ లేఖ