ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

'ఉద్యోగుల సమస్యలపై ఐఏఎస్ అధికారులు స్పందించట్లేదు' - ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలు న్యూస్

తమ సమస్యలపై ఐఏఎస్ అధికారులు స్పందించే తీరు మారాలని.. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం విజ్ఞప్తి చేసింది. కోవిడ్ ప్రభావం‌ దృష్ట్యా ఆరు నెలల నుంచి ప్రధాన కార్యదర్శి సచివాలయానికి రాలేదని ఏపీజీఈఏ (ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల అసోసియేషన్) రాష్ట్ర అధ్యక్షుడు కెఆర్.సూర్యనారాయణ, ప్రధాన కార్యదర్శి జి.ఆస్కారరావు విమర్శించారు.

'ఉద్యోగుల సమస్యలపై ఐఏఎస్ అధికారులు స్పందించట్లేదు'
'ఉద్యోగుల సమస్యలపై ఐఏఎస్ అధికారులు స్పందించట్లేదు'

By

Published : Sep 29, 2020, 3:40 PM IST

Updated : Sep 29, 2020, 4:05 PM IST

సమస్యలపై వచ్చే ఉద్యోగులు, ఉద్యోగ సంఘాల ప్రతినిధులతో ఐఏఎస్ అధికారులు సమావేశం కాలేదని ఏపీ జీఈఏ సభ్యులు ఆరోపించారు. దాదాపు 70 శాతం మంది ఐఏఎస్ అధికారులు ఇదే తీరులో వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. కొందరు ఐఏఎస్ అధికారుల వద్ద నెలల తరబడి దస్త్రాలు అపరిష్కృతంగా ఉన్నాయని... నిబంధనల ప్రకారం మూడు రోజుల కంటే ఒక అధికారి వద్ద దస్త్రం చర్యల కోసం ఉండకూడదని చెప్పారు. కొవిడ్‌-19 కారణంగా అధికారులు సచివాలయానికి రావడం లేదని... 30 నుంచి 50 శాతం మాత్రమే హాజరవుతున్నారని ఆరోపించారు.

ప్రతి శాఖలోనూ... క్షేత్రస్థాయి ఉద్యోగులకు కోవిడ్‌ పాజిటివ్‌ వచ్చినా సెలవు మంజూరు చేయడం లేదని... వైద్య ఆరోగ్యశాఖలో 14 రోజుల ప్రత్యేక సెలవు మంజూరుకు అంగీకారం తెలిపి 2 నెలలు కావస్తున్నా ఇప్పటికీ జీవో జారీ కాలేదని ఏపీజీఈఏ పేర్కొంది. ఆర్థిక, సాధారణ పరిపాలనశాఖల మధ్య దస్త్రాలు తిరుగుతున్నాయని... మరోవైపు క్షేత్రస్థాయి ఉద్యోగులకు లక్ష్యాలను నిర్దేశించి మరీ విధులు అప్పగిస్తున్నారని సభ్యులు చెప్పారు.

Last Updated : Sep 29, 2020, 4:05 PM IST

ABOUT THE AUTHOR

...view details