ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

'ప్రభుత్వం నిర్దేశించిన ధరలకే ఆన్‌లైన్‌లో సినిమా టికెట్లు' - online movie tickets price in ap

APFMC on Online Tickets Price: ప్రభుత్వం నిర్దేశించిన ధరలకే ఆన్‌లైన్‌లో సినిమా టికెట్ల విక్రయాలు ఉంటాయని ఏపీఎఫ్‌డీసీ ఎండీ విజయ్‌ కుమార్‌ రెడ్డి తెలిపారు. యువర్‌ స్క్రీన్స్‌ పోర్టల్‌ ద్వారా బ్లాక్‌ టికెటింగ్‌కు అడ్డుకట్ట పడుతుందన్నారు. ప్రేక్షకుల దృష్ట్యా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని చెప్పారు.

APFMC on Online Tickets Price
APFMC on Online Tickets Price

By

Published : Jun 22, 2022, 10:41 PM IST

Movie Tickets: ప్రేక్షకులకు తక్కువ ధరకే సినిమా టిక్కెట్లు ఇవ్వాలనేదే ప్రభుత్వ లక్ష్యమని ఏపీఎఫ్‌డీసీ ఎండీ విజయ్‌కుమార్‌రెడ్డి వెల్లడించారు. ప్రభుత్వం నిర్దేశించిన ధరలకే ఆన్‌లైన్‌లో సినిమా టికెట్ల విక్రయాలు ఉంటాయన్నారు. యువర్‌ స్క్రీన్స్‌ పోర్టల్‌ ద్వారా బ్లాక్‌ టికెటింగ్‌కు అడ్డుకట్ట పడుతుందన్నారు. యువర్‌ స్క్రీన్స్‌ పోర్టల్‌లో సినిమా టికెట్‌ బుక్‌ చేసుకుంటే అదనపు ఛార్జీలు ఉండవని స్పష్టం చేశారు. ఆన్‌లైన్‌ విధానం వల్ల థియేటర్లకు ఉన్న పాత ఒప్పందాలు రద్దుకావని వెల్లడించారు.

ABOUT THE AUTHOR

...view details