- నీటి ప్రాజెక్టులకు అనుమతి ఇచ్చే అధికారం అపెక్స్ కౌన్సిల్‌కు ఉంది: షెకావత్
- రెండు రాష్ట్రాలు లేవనెత్తిన అంశాలపై చర్చించాం: షెకావత్
- అపెక్స్ కౌన్సిల్ భేటీలో 4 అంశాలపై ప్రధానంగా చర్చించాం: షెకావత్
- ఆరేళ్లు గడిచినా గోదావరి బోర్డు పరిధి నిర్ణయం కాలేదు: షెకావత్
- కృష్ణా, గోదావరి యాజమాన్య బోర్డులపై చర్చించాం: షెకావత్
- కృష్ణా బోర్డు కార్యాలయాన్ని ఏపీకి తరలించడంపై చర్చించాం: షెకావత్
- కృష్ణా, గోదావరి బోర్డుల పరిధిని కేంద్రం త్వరలో నిర్ణయిస్తుంది: షెకావత్
- నదీజలాల సమస్య పరిష్కారం కోసం అపెక్స్ కౌన్సిల్ ఏర్పాటు: షెకావత్
- సమావేశంలో ఇద్దరు సీఎంలు తమతమ వాదనలు వినిపించారు: షెకావత్
- కొత్త ప్రాజెక్టుల డీపీఆర్‌లు ఇద్దరు సీఎంలను కోరాం: షెకావత్
- డీపీఆర్‌లు ఇచ్చేందుకు ఇద్దరు సీఎంలు అంగీకరించారు: షెకావత్
- ట్రైబ్యునల్ ద్వారా తెలంగాణకు నీరు కేటాయించాలని కేసీఆర్ కోరారు: షెకావత్
- అవసరమైతే కేసు వెనక్కి తీసుకుంటామని కేసీఆర్ తెలిపారు: షెకావత్
- తెలంగాణ కేసు ఉపసంహరించుకున్నాక న్యాయపర అంశాలు పరిశీలిస్తాం: షెకావత్
కృష్ణా యాజమాన్య బోర్డును ఏపీకి తరలించాలని నిర్ణయం: షెకావత్ - అపెక్స్ కౌన్సిల్ తాజా వార్తలు
కొత్త ప్రాజెక్టుల డీపీఆర్‌లు ఇద్దరు సీఎంలను కోరాం: షెకావత్
15:24 October 06
కొత్త ప్రాజెక్టుల డీపీఆర్‌లు ఇద్దరు సీఎంలను కోరాం: షెకావత్
15:09 October 06
గోదావరి జలాల పంపిణీకి, ట్రైబ్యునల్ ఏర్పాటుకు 2 రాష్ట్రాల అంగీకారం
- నదీ యాజమాన్య బోర్డుల పరిధిపై అపెక్స్ కౌన్సిల్ భేటీలో చర్చ
- పోతిరెడ్డిపాడు విస్తరణ, రాయలసీమ ఎత్తిపోతలపై అభ్యంతరం చెప్పిన కేసీఆర్
- పోతిరెడ్డిపాడు, రాయలసీమ ఎత్తిపోతల కింద కొత్త ఆయకట్టు లేదన్న జగన్
- కేటాయింపులను సరిగా వాడుకునేందుకే పనులు చేపట్టామన్న జగన్
- గోదావరి జలాల పంపిణీకి, ట్రైబ్యునల్ ఏర్పాటుకు 2 రాష్ట్రాల అంగీకారం
- కృష్ణానది యాజమాన్యం బోర్డు తరలింపుపైనా వ్యక్తం కాని అభ్యంతరాలు
12:24 October 06
జలవివాదాలపై వాదనలతో సిద్ధమైన తెలుగు రాష్ట్రాలు
- దిల్లీలో కొనసాగుతున్న అత్యున్నత మండలి సమావేశం
- కేంద్ర జల్‌శక్తి మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ నేతృత్వంలో సమావేశం
- దృశ్యమాధ్యమం ద్వారా పాల్గొన్న తెలుగు రాష్ట్రాల సీఎంలు జగన్, కేసీఆర్
- దిల్లీ నుంచి వీడియోకాన్ఫరెన్స్ ద్వారా పాల్గొన్న సీఎం జగన్
- హైదరాబాద్ నుంచి వీడియోకాన్ఫరెన్స్ ద్వారా పాల్గొన్న తెలంగాణ సీఎం కేసీఆర్
- దృశ్యమాధ్యమం ద్వారా పాల్గొన్న కృష్ణా, గోదావరి నదీ యాజమాన్య బోర్డుల ఛైర్మన్లు
- నాలుగు అంశాలను అజెండాగా ప్రతిపాదించిన జల్‌శక్తి శాఖ
- పరస్పర ఫిర్యాదులు, అభ్యంతరాలపైనా చర్చించే అవకాశం
- ఏడు అంశాలను సమావేశ అజెండాలో చేర్చాలని కోరిన తెలంగాణ సీఎం
- కేంద్ర జల్‌శక్తి మంత్రికి 4 రోజుల క్రితం 14 పేజీల లేఖ రాసిన తెలంగాణ సీఎం
Last Updated : Oct 6, 2020, 7:01 PM IST