ప్రభుత్వానికి లేఖ రాసిన ఏపీఈఆర్సీ(APERC letter to govt).. వివిధ అంశాలను ప్రస్తావించింది. ప్రభుత్వం నుంచి డిస్కంలకు రావాల్సిన రూ.15,474 కోట్ల సబ్సిడీ బకాయలు వెంటనే చెల్లించాలని ఆదేశించింది. స్థానిక సంస్థలు, ఇతర ప్రభుత్వ శాఖల నుంచి రావాల్సిన రూ.9,783 కోట్లను విడుదల చేయాలని స్పష్టం చేసింది. బకాయిల చెల్లింపులపై 14 రోజుల గడువుతో నోటీసులు ఇవ్వాలని సూచించింది. ప్రభుత్వ శాఖలు, స్థానిక సంస్థల నుంచి 14 రోజుల్లో స్పందన రాకపోతే విద్యుత్ సరఫరా నిలిపివేయాలని ఆదేశించింది. డిస్కంలు మనుగడే ప్రమాదంలో పడిందని ఏపీఈఆర్సీ లేఖలో పేర్కొంది.
APERC : "బిల్లులు చెల్లించకపోతే.. ప్రభుత్వ కార్యాలయాలకు కరెంట్ కట్ చేస్తాం" - సీఎస్‌కు ఏపీఈఆర్సీ లేఖ
12:09 November 12
ఏపీఈఆర్సీ ఘాటుగా లేఖ
ఏపీఈఆర్సీ ఫిర్యాదు..
రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితోపాటు, డిస్కంలకు, ఇంధన శాఖ కార్యదర్శికి ఏపీఈఆర్సీ ఘాటుగా లేఖ(APERC letter) రాసింది. డిస్కంలకు చెల్లించాల్సిన రూ.25,257 కోట్ల సబ్సిడీ బకాయిల పెండింగ్‌పై ఈఆర్సీ రాసిన లేఖను ప్రజాపద్దుల కమిటీ ఛైర్మన్ పయ్యావుల కేశవ్( Prajapaddula Committee chairman Payyavala Keshav) మీడియాకు విడుదల చేశారు. ఈ నెల 9వ తేదీన హైదరాబాద్‌లో ఏపీఈఆర్సీ ఛైర్మన్‌ను కలిసిన కేశవ్... ఇంధన శాఖలో పరిస్థితులు, నిర్ణయాలపై ఫిర్యాదు చేశారు.
ప్రభుత్వం విద్యుత్ సంస్థలకు రూ.25 వేల కోట్లు బకాయి పడింది. లోటు భర్తీకి డిస్కంలు అధిక వడ్డీతో అప్పులు తెస్తున్నాయి. అధిక వడ్డీ భారం వినియోగదారులపై ట్రూఅప్ పేరుతో మోపుతున్నారు. విద్యుత్ రంగాన్ని ప్రభుత్వం సర్వనాశనం చేస్తుందని ఈఆర్‌సీకి చెప్పా. ట్రూఅప్ ఛార్జీలపై ఒకరు హైకోర్టుకు వెళ్లడంతో ఈఆర్‌సీ ఉత్తర్వులు ఇచ్చింది. పాతిక వేల కోట్ల బకాయిలు చెల్లించాలని ఈఆర్‌సీ లేఖ రాసింది. విద్యుత్ రంగం తీవ్ర సంక్షోభంలో ఉందని ఈఆర్‌సీ చెప్పింది. ఈఆర్‌సీ ప్రజల పక్షాన నిలవకపోతే ఎలా? : పయ్యావుల కేశవ్, ప్రజాపద్దుల కమిటీ ఛైర్మన్
ఇదీ చదవండి