పాలిటెక్నిక్ పూర్తి చేసినవారు ఇంజనీరింగ్ రెండో సంవత్సరంలో చేరేందుకు నిర్వహించిన ఏపీ ఈసెట్ 2019 ఫలితాలను ఉన్నత విద్యా మండలి ఛైర్మన్ విజయరాజు విడుదల చేశారు. విజయవాడ డీవీ మేనర్ హోటల్లో ఫలితాల విడుదల కార్యక్రమం నిర్వహించారు. వివిధ విభాగాల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన పరీక్షలో మొదటి ర్యాంకులు సాధించిన విద్యార్థుల పేర్లను విజయరాజు ప్రకటించారు. 37 వేల 749 మంది విద్యార్థులు ఈసెట్ కు హాజరుకాగా... 37వేల 66 మంది ఉత్తీర్ణత సాధించినట్లు ప్రకటించారు. ఈ నెల 19 నుంచి సంబంధిత వెబ్ సైట్ ద్వారా విద్యార్థులు ర్యాంకు కార్డులు డౌన్ లోడ్ చేసుకోవాలని సూచించారు.
ఏపీ ఈసెట్ 2019 ఫలితాలు విడుదల
ఏపీ ఈసెట్ 2019 ఫలితాలను ఉన్నత విద్యా మండలి ఛైర్మన్ విజయరాజు విజయవాడలో విడుదల చేశారు. ఈ నెల 19 నుంచి వెబ్ సైట్ ద్వారా విద్యార్థులు ర్యాంకు కార్డులు డౌన్ లోడ్ చేసుకోవాలని ఆయన సూచించారు.
ఏపీ ఈసెట్ 2019 ఫలితాలు విడుదల
ఇవి చదవండి....ఇంటర్ బోర్డు ముందు విద్యార్థుల ఆందోళన