ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

Power cuts: గ్రామాల్లో అనధికారిక విద్యుత్ కోతలు.. డిస్కంల వైఫల్యమేనా?

ప్రీపెయిడ్ విద్యుత్ కొనుగోలు వ్యవహారం.. రాష్ట్రంలో విద్యుత్ కోతలకు కారణమవుతోంది. డిమాండ్ ఉన్నా.. కొనుగోళ్లకు ముందస్తు చెల్లింపులు లేని కారణంగా సరఫరాలో ఇబ్బందులు తలెత్తుతున్నాయి. ప్రైవేటు, ప్రభుత్వ రంగ సంస్థలు కూడా ప్రీపెయిడ్ చెల్లింపులు కోరుతుండటంతో గ్రిడ్ నుంచి విద్యుత్ తీసుకోవటంలో సమస్యలు ఎదురవుతున్నాయి. దీంతో గ్రామీణ ప్రాంతాలకు విద్యుత్ కోతల ప్రభావం మొదలైంది.

special story on power supply shortage in ap
విద్యుత్ సరఫరాలో డిస్కంలు విఫలం

By

Published : Aug 31, 2021, 10:53 PM IST

గ్రామీణ ప్రాంతాల్లో అనధికారకంగా విద్యుత్ కోత..!

కేంద్రం ప్రవేశపెట్టిన విద్యుత్ కొనుగోళ్లకు ముందస్తు చెల్లింపుల విధానం.. రాష్ట్ర ప్రభుత్వానికి అశనిపాతంలా మారింది. వేసవి కాలం ముగిసిపోయి విద్యుత్ డిమాండ్ (POWER DEMAND) తగ్గినప్పటికీ.. అవసరాలకు తగినంత సరఫరా లేక విద్యుత్‌ కోతలు అమలవుతున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతానికి నగర, పట్టణ ప్రాంతాల్లో కోతలు లేకపోయినా.. గ్రామీణ ప్రాంతాల్లో మాత్రం విద్యుత్ కోతలు అనధికారికంగా అమలవుతున్నాయి. రాష్ట్రంలోని థర్మల్, జలవిద్యుత్ కేంద్రాల నుంచి పూర్తిస్థాయి విద్యుత్ ఉత్పత్తి లేక బయట కొనుగోలు చేసేందుకు డబ్బులు లేక ప్రభుత్వం సతమతమవుతోంది. కేంద్రం అమలు చేస్తున్న నూతన విధానం మేరకు ముందస్తు చెల్లింపులు చేస్తే తప్ప.. విద్యుత్ సరఫరా చేయబోమని ప్రైవేటు కంపెనీలు తెగేసి చెప్పాయి. దీంతో డిమాండ్‌కు తగినట్టుగా విద్యుత్ సరఫరా(POWER SUPPLY) చేయటంలో డిస్కంలు విఫలమవుతున్నాయి.

డిమాండ్ తగ్గినా.. తగిన ఉత్పత్తి లేదు

విద్యుత్‌ కొనుగోలు ఒప్పందాలు ఉన్న కొన్ని కంపెనీలు మాత్రమే రాష్ట్రానికి విద్యుత్ సరఫరా చేస్తున్నాయి. ప్రస్తుతం రాష్ట్రంలో 171 మిలియన్ యూనిట్ల డిమాండ్ ఉందని విద్యుత్ సంస్థలు చెబుతున్నాయి. ఈ నెల ప్రారంభంలోనూ 212 మిలియన్ యూనిట్ల వరకూ విద్యుత్ డిమాండ్ ఏర్పడింది. వర్షాకాలం కావటంతో విద్యుత్ డిమాండ్ దాదాపు 40 మిలియన్ యూనిట్ల మేర తగ్గినప్పటికీ.. తగినంత ఉత్పత్తి లేక గ్రామీణ ప్రాంతాల్లో విద్యుత్‌కు కోత పడింది.

రాష్ట్రవ్యాప్తంగా 7,637 మెగావాట్ల విద్యుత్ వినియోగం

ముందస్తు విద్యుత్ (POWER) కొనుగోలు ఒప్పందాల్లో భాగంగా వివిధ గ్యాస్ ఆధారిత విద్యుత్ ఉత్పత్తి స్టేషన్ల నుంచి 7.285 మిలియన్ యూనిట్లు, ఇతర సంస్థల నుంచి 74.903 మిలియన్ యూనిట్లను కొనుగోలు చేస్తున్నారు. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 7,637 మెగావాట్ల విద్యుత్ వినియోగం అవుతోందని విద్యుత్ శాఖ అధికారులు చెబుతున్నారు. సీలేరు, మాచ్ ఖండ్, తుంగభద్ర డ్యామ్, నాగార్జున సాగర్ కుడికాలువ, టెయిల్ పాండ్ జల విద్యుత్ కేంద్రాల నుంచి 6.395 మిలియన్ యూనిట్లు , ధర్మల్ విద్యుత్ కేంద్రాల నుంచి 54.395 మిలియన్ యూనిట్లు ఉత్పత్తి చేసి సరఫరా చేశారు.

డిస్కంలు ముందుకు రావడంలేదు..

ప్రీపెయిడ్ చెల్లింపులు సకాలంలో జరగకపోవడంతోనే ఎక్స్చేంజ్​ల ద్వారా విద్యుత్ కొనుగోళ్ల(power purchase)కు ఇబ్బందులు ఎదురవుతున్నట్లు అధికారులు చెబుతున్నారు. గ్రిడ్‌లో హెచ్చుతగ్గుల అంశంతో పాటు పీపీఏ(PPA)లు ఉన్నప్పటికీ... సౌర, పవన విద్యుత్‌ల కొనుగోలుకు డిస్కంలు ముందుకు రావడంలేదన్నారు. మరోవైపు రాయలసీమ థర్మల్ పవర్ ప్లాంట్, వీటీపీఎస్​లోనూ పూర్తిస్థాయి విద్యుత్ ఉత్పత్తి జరగడం లేదని తెలిపారు.

ఇదీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details