తెదేపా అధినేత చంద్రబాబునాయుడును రేణిగుంట విమానాశ్రయంలో అడ్డుకోవడం అప్రజాస్వామికమని ఏపీసీసీ కార్యనిర్వహక అధ్యక్షుడు తులసీరెడ్డి ఆరోపించారు. ఈ ఘటనను పార్టీలకతీతంగా ప్రజాస్వామ్యవాదులందరూ ఖండించాలని పిలుపునిచ్చారు. రాష్ట్రంలో వైకాపా ప్రభుత్వ ఆరాచకాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయని ఆందోళన వ్యక్తంచేశారు. 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తికే రక్షణ లేకుంటే సామన్యుడికి రక్షణ ఎలా ఉంటుందని ప్రశ్నించారు.
చంద్రబాబు అడ్డగింత దుర్మార్గం: తులసీరెడ్డి
రేణిగుంట విమానాశ్రయంలో తెదేపా అధ్యక్షుడు చంద్రబాబునాయుడును అడ్డుకోవడం దుర్మార్గమమని ఏపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు తులసీరెడ్డి అన్నారు. రాష్ట్రంలో వైకాపా అరాచకాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయని ధ్వజమెత్తారు.
ఏపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు తులసీరెడ్డి