ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

అందరికి ఉచితంగా టీకా ఇవ్వాలి: శైలజానాథ్ - శైలజానాథ్ తాజా వార్తలు

సార్వత్రిక టీకా భారత దేశ ప్రజల హక్కని.., అది భిక్ష కాదని ఏపీసీసీ అధ్యక్షుడు సాకే శైలజానాథ్ వ్యాఖ్యానించారు. యూనివర్సల్ ఇమ్యూనైజేషన్ ప్రోగ్రాంలో భాగంగా అందరికి టీకా ఉచితంగా ఇవ్వాలన్నారు.

apcc Sailajanath on Vaccination in india
అందరికి ఉచిత టీకా ఇవ్వాలి

By

Published : Jun 7, 2021, 10:04 PM IST

యూనివర్సల్ ఇమ్యూనైజేషన్ ప్రోగ్రాంలో భాగంగా అందరికి టీకా ఉచితంగా ఇవ్వాలని ఏపీసీసీ అధ్యక్షుడు సాకే శైలజానాథ్ డిమాండ్‌ చేశారు. సార్వత్రిక టీకా భారత దేశ ప్రజల హక్కని.., అది భిక్ష కాదని వ్యాఖ్యానించారు. ఆక్సిజన్ కొరత, కేంద్ర ప్రభుత్య వైఫల్యం వల్ల ఎంతో మంది చనిపోతే.., ప్రధాని మోదీ కనీసం సానుభూతి కూడా వ్యక్తం చేయలేదని విమర్శించారు. అందరికీ ఉచితంగా వేయాలని కాంగ్రెస్ పార్టీ తరపున డిమాండ్ చేశారు.

ABOUT THE AUTHOR

...view details