ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

'వారికి నెలకు రూ.10 వేల ఆర్థిక సాయం అందించాలి' - విజయవాడలో శైలజానాథ్ నిరసన

లాక్​డౌన్ పూర్తయ్యేంతవరకు నిరాశ్రయులైన వారికి రాష్ట్ర ప్రభుత్వం తరపున 10 వేల ఆర్థికసాయం అందించాలని ఏపీసీసీ అధ్యక్షుడు శైలజానాథ్ డిమాండ్ చేశారు. రైతు రుణ మాఫీ చేయటంతో పాటు పంటలను ప్రభుత్వమే కొనుగోలు చేయాలన్నారు.

ఏపీసీసీ అధ్యక్షుడు శైలజానాథ్
ఏపీసీసీ అధ్యక్షుడు శైలజానాథ్

By

Published : Apr 24, 2020, 7:04 PM IST

లాక్​డౌన్ కారణంగా నిరాశ్రయులైన వలస కూలీలు, రైతులు, చిరువ్యాపారులను ఆదుకోవాలని రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు శైలజానాథ్ డిమాండ్ చేశారు. వారికి మద్దతుగా విజయవాడ ఆంధ్రరత్న భవన్​లో భౌతికదూరం పాటిస్తూ నిరసన చేపట్టారు. చితికిపోయన రైతు జీవితాలను కాపాడాలన్నారు. రుణ మాఫీ చేయటంతో పాటు పంటలను ప్రభుత్వమే కొనుగోలు చేయాలన్నారు. లాక్​డౌన్ పూర్తయ్యేంతవరకు నిరాశ్రయులకు నెలకు రూ.10 వేల ఆర్థిక సాయం అందిచాలని ఆయన డిమాండ్ చేశారు. కరోనాకు మతం రంగు పులమటం మాని...ప్రజలకు వైరస్ టెస్టులు విస్తృతంగా నిర్వహించాలని హితవు పలికారు.

ABOUT THE AUTHOR

...view details