అంబేడ్కర్ విగ్రహాన్ని అవమానపరిచిన వారిని ప్రభుత్వం బహిరంగంగా శిక్షించాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తోందని ఏపీసీసీ అధ్యక్షులు శైలజానాధ్ అన్నారు. విజయవాడలో మీడియాతో మాట్లాడిని ఆయన.. దేవుడి విగ్రహాల ధ్వంసం అంశంలో ప్రభుత్వం కఠినంగా వ్యవహరించి ఉంటే.. నేడు చింతలపూడిలో అంబేద్కర్ విగ్రహానికి అవమానం జరిగేది కాదన్నారు. రైతులపై దాడులు జరుగుతున్నా.. ఏపీలో ఉన్న మూడు ప్రధాన పార్టీల నేతలు ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. వ్యవసాయ పంపు సెట్లకు మీటర్లు బిగించే కార్యక్రమాన్ని ప్రభుత్వం విరమించుకోవాలన్నారు.
'అంబేడ్కర్‌ను అవమానించిన వారిని బహిరంగంగా శిక్షించాలి' - చింతలపూడి ఘటన వార్తలు
చింతలపూడిలో అంబేడ్కర్ విగ్రహాన్ని అవమానించిన వారిని... ప్రభుత్వం బహిరంగంగా శిక్షించాలని ఏపీసీసీ అధ్యక్షుడు శైలజానాధ్ డిమాండ్ చేశారు. పంచాయతీ ఎన్నికలు స్వేచ్ఛాయుతంగా జరగాలంటే... అభ్యర్థుల అపహరణ, దాడులు, నామపత్రాల చించివేత వంటివి జరగకుండా ఎన్నికల కమిషనర్ చర్యలు తీసుకోవాలన్నారు.
ఏపీసీసీ అధ్యక్షుడు శైలజానాధ్
రాష్ట్రంలో స్వేచ్చాయుత ఎన్నికలంటే అభ్యర్థుల అపహరణ, దాడులు, నామపత్రాల చించివేత వంటివి జరగకుండా ఎన్నికల కమిషనర్ చర్యలు తీసుకోవాలన్నారు. బడ్జెట్ పేరుతో ఇచ్చిన రాయితీలు ఎవరికి మేలు చేయలేదని....తిరుపతి వేదికగా ఏపీకి ప్రకటించిన హోదా ఏమయ్యిందో భాజపా నేతలు చెప్పాలన్నారు. మధ్య తరగతి, పేదలకు మేలు చేయని బడ్జెట్ ప్రవేశ పెట్టడం వల్ల ఎవరికీ ఉపయోగంలేదన్నారు.
ఇదీ చదవండి:'కేంద్ర బడ్జెట్ చాలా నిరాశాజనకంగా ఉంది'