పేదలకు పక్క ఇళ్లు ఇస్తామంటున్న ప్రభుత్వం రెండేళ్లలో పది శాతం ఇళ్లు కూడా పూర్తి చేయలేదని ఏపీసీసీ అధ్యక్షుడు శైలాజానాథ్ విమర్శించారు. దసరా నాటికి గృహ ప్రవేశాలు జరుపుతామన్న ప్రభుత్వం చెప్పిందని అన్నారు. అయితే ఇంతవరకు ఇంటి నిర్మాణం పునాదులే పూర్తి చేయలేకపోయిందని ఎద్దేవా చేశారు.
కేంద్రం ఇస్తుంటే..రాష్ట్రం కొన్నింటినే ఇస్తోంది
అప్పులు తెచ్చి కాలం వెళ్లదీస్తున్న సర్కారు.. పేదలకు పక్కా ఇళ్లు ఎప్పుడు ఇస్తుందని ప్రశ్నించారు. వైకాపా ప్రభుత్వం పేదల ఇంటికి కేవలం రూ.30 వేలు మాత్రమే ఇస్తోందని.. వాటిని కూడా ఉపాధి హామీ నిధులకు ముడిపెట్టేసిందని మండిపడ్డారు. పీఎంఏవై కింద కట్టే ఈ ఇళ్లకు కేంద్రం మూడు దఫాలుగా నిధులు మంజూరు చేస్తుందన్నారు. తొలి, రెండో విడతల్లో రూ. 60వేలు, మూడో విడతలో రూ. 30వేలు కేంద్రం విడుదల చేస్తుందన్నారు.