సీఎం జగన్ ప్యాలస్ వదిలి ప్రజల్లోకి రావాలని ఏపీసీసీ అధ్యక్షుడు శైలజానాథ్ వ్యాఖ్యానించారు. ప్రజల కరోనా కష్టాలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలదే బాధ్యత అన్నారు. చనిపోయాక బాధితుల కుటుంబాలకు ఏదో చేస్తామని చెప్పడం హాస్యాస్పదమన్నారు. రైతులు పంట కొనే వారు లేక అల్లాడుతున్నా ప్రభుత్వం పట్టించుకోవటం లేదన్నారు. లక్ష కోట్లు పంచామంటున్న జగన్ ఆ నిధులు ఎక్కడి నుంచి తెచ్చారో చెప్పాలన్నారు. కరోనా మూడో వేవ్ ను ఎదుర్కొనేందుకు ఇప్పటి నుంచే జాగ్రత్తలు చేపట్టాలన్నారు.
'సీఎం జగన్ ప్యాలస్ వదిలి ప్రజల్లోకి రావాలి..'
ప్రభుత్వ లోపాలను ఎత్తి చూపితే మీడియాపై ఆంక్షలు పెడతారా? అని ఏపీసీసీ అధ్యక్షుడు శైలజానాథ్ విమర్శించారు. రాష్ట్రంలో గడిచిన రెండేళ్లలో ఎన్ని ఇళ్లు కట్టారు, ఎంత మంది విద్యార్థులకు స్కాలర్ షిప్స్ ఇచ్చారని ప్రశ్నించారు.
ఎపీసీసీ అధ్యక్షుడు శైలజానాథ్