అంతర్జాతీయంగా చమురు ధరలు తగ్గినా.. నిబంధనల ప్రకారం రాష్ట్రాల్లో ఎందుకు తగ్గడం లేదని ఏపీసీసీ అధ్యక్షుడు శైలజానాథ్ ప్రశ్నించారు. పరిపాలన అంటే లాభ, నష్టాల వ్యవహారం కాదన్నారు. రాష్ట్రంలో విద్యుత్ బిల్లులు చూసి ప్రజలు భయపడి పోతున్నారని... ఎటువంటి నోటిఫికేషన్ లేకుండా విద్యుత్ ఛార్జీలు పెంచారని మండిపడ్డారు. 'మూడు నెలల కాలానికి ఒకే బిల్లుతో టారిఫ్ మార్చి ప్రజలను దోచుకుంటున్నారు. బిల్లులు ఎలా పెరిగాయో ప్రభుత్వమే చెప్పాలి లేదా... పూర్తిగా రద్దు చేయాలి. రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితి చూస్తే మాలాంటోళ్లకి భయమేస్తుంది. కరోనాతో ప్రజలు యుద్ధం చేస్తుంటే... ప్రభుత్వాలు ఆదాయం కోసం పాకులాడుతున్నాయి.' అని శైలజానాథ్ విమర్శించారు.
రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితి చూస్తే.. భయమేస్తోంది: శైలజానాథ్ - ఏపీ ఆర్థిక పరిస్థితి వార్తలు
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అసత్యాలు ప్రచారం చేస్తూ ప్రజలను మోసం చేస్తున్నాయని ఏపీసీసీ అధ్యక్షుడు శైలజానాథ్ ఆరోపించారు. రోజురోజుకు పెరుగుతున్న పెట్రోల్, డీజిల్ ధరలను ఎందుకు నియంత్రించడం లేదని ప్రశ్నించారు.
apcc president sailajanath comments on state financial situation