ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

కేసీఆర్ వ్యాఖ్యలు మీకు ఇబ్బంది కలిగించడం లేదా?: తులసి రెడ్డి - apcc leader thulasi reddy on kcr bytes

ముఖ్యమంత్రి జగన్ పై ఏపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు తులసిరెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర అభివృద్ధి గురించి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు ఇబ్బంది కలిగించడం లేదా అని సీఎం జగన్​ను ప్రశ్నించారు.

apcc leader thulasi reddy fire on cm jagan
ఏపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు తులసిరెడ్డి

By

Published : Mar 29, 2021, 2:59 PM IST

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ వ్యాఖ్యలు మీకు ఇబ్బంది కలిగించడం లేదా అని ఏపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు తులసి రెడ్డి ముఖ్యమంత్రి జగన్‌ను ప్రశ్నించారు. ఇటీవల కాలంలో తెలంగాణ బాగా అభివృద్ధి చెందిందని, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందలేదని కేసీఆర్ అన్నారంటూ ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు.

ఇప్పటికైనా కక్ష రాజకీయాలు మాని ప్రగతి రాజకీయాలతో సమర్థవంతమైన పాలన అందించాలని తులసిరెడ్డి సీఎం జగన్​కు సూచించారు. ప్రభుత్వం జారీ చేసిన జీవో నెంబర్-2 పంచాయతీరాజ్ చట్టానికి, 73వ రాజ్యాంగ సవరణ స్పూర్తికి విఘాతం కలిగిస్తోందని తులసి రెడ్డి విమర్శించారు.

ABOUT THE AUTHOR

...view details