ఎస్సీ, ఎస్టీల పట్ల వివక్ష చూపడం తగదని... ఎన్నికల సమయంలో వారికిచ్చిన హామీలను అమలు చేయాలని కోరుతూ.. ఏపీసీసీ అధ్యక్షులు శైలజానాథ్ ముఖ్యమంత్రి జగన్‌కి బహిరంగ లేఖ రాశారు. వైకాపా పాలనలో ఎస్సీ, ఎస్టీలపై దాడులు చోటుచేసుకున్నాయని లేఖలో ప్రస్తావించారు. సౌకర్యాలు అడగటమే తప్పన్నట్లు వైద్యుడు సుధాకర్‌ను అధికారులు, పోలీసులు అవమానించడమే ఇందుకు ఉదాహరణగా పేర్కొన్నారు. అదే కోవలో డాక్టర్ అనితను కూడా వేధించారన్నారు. క్షమాపణ చెప్పినా విధుల్లోకి తీసుకోకపోవడం వివక్ష కాదా అని ప్రశ్నించారు.
ఏడాది పాలనలో ఎంతమంది లబ్ది పొందారో శ్వేతపత్రం విడుదల చేయాలి: శైలజానాథ్ - APCC chirman Sailajanadh Letter To CM
వైకాపా ఏడాది పాలనలో ఎంతమంది ఎస్సీ, ఎస్టీలు లబ్ది పొందారో శ్వేతపత్రం విడుదల చేయాలని ఏపీసీసీ శైలజానాథ్ డిమాండ్ చేశారు. ఈ మేరకు సీఎం జగన్ ఆయన లేఖ రాశారు.
ఏపీసీసీ అధ్యక్షులు శైలజానాథ్ లేఖ
ఏడాది కాలంలో ఎంతమంది ఎస్సీ, ఎస్టీలు లబ్ది పొందారో శ్వేతపత్రం విడుదల చేయాలని శైలజానాథ్ డిమాండ్ చేశారు. కరోనా కాలంలో పనుల్లేక ఇబ్బందులు పడుతున్న దళితులు, ఆదివాసీలకు 15 వేల రూపాయలు ఆర్ధిక సాయం చేయాలని డిమాండ్ చేశారు. ఎస్సీ, ఎస్టీ కార్పొరేషన్ నిధులన్నీ అమ్మఒడి పథకానికి తరలించడం వివక్ష కాదా అని ప్రశ్నించారు.
ఇవీ చదవండి:పార్టీ బలోపేతంపై జగన్ దృష్టి..ముగ్గురు నేతలకు బాధ్యతలు
TAGGED:
శైలజానాథ్ వార్తలు