కరోనా రోగుల పట్ల మానవత్వం చూపాలని ఏపీసీసీ అధ్యక్షులు డా.శైలజానాథ్ ప్రభుత్వాన్ని కోరారు. విదేశాల నుంచి వ్యాక్సిన్ కొనుగోలు చేయాలని సీఎం జగన్కు సూచించారు. తిరుపతి రుయా ఆస్పత్రిలో ఆక్సిజన్ అందక పలువురు మృతి చెందడంపై.. కాంగ్రెస్ పార్టీ తరపున ప్రగాఢ సంతాపం తెలిపారు.
ఇదీ చదవండి:'మోదీ జీ... ఆ అద్దాలు తీసి చూడండి'
కనీసం ప్రాణవాయువు అందించలేని బలహీనమైన ప్రభుత్వం రాష్ట్రంలో ఉందని శైలజానాథ్ విమర్శించారు. ఖచ్చితంగా ఇది చేతగాని సర్కారేనని.. అందుకే చేతులెత్తేశారని మండిపడ్డారు. కరోనా మరణాలన్నీ ముమ్మాటికీ ప్రభుత్వ హత్యలేనని ఆరోపించారు. వాక్సిన్ కొరత నెపం కేంద్రంపై నెట్టకుండా, విదేశాల నుంచి టీకా తెప్పించే ప్రయత్నం చేయాలన్నారు. కేంద్రంపై ఆధారపడకుండా వాక్సిన్ కొనుగోలు చేసి అందరికీ వేయాలన్నారు.
ఇదీ చదవండి:
రుయాలో కరోనా రోగులు చనిపోలేదు.. ప్రభుత్వమే చంపేసింది: లోకేశ్