ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

విద్యుత్ నియంత్రణ మండలి ఛైర్మన్ ఎంపికకు కమిటీ - Chairman of the Electricity Regulatory Board

రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి ఛైర్మన్ ఎంపిక కోసం కమిటీని ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు విడుదల చేసింది.

ఏపీ విద్యుత్ నియంత్రణా మండలి ఛైర్మన్ ఎంపికకు కమిటీ

By

Published : Aug 1, 2019, 11:20 PM IST

ఏపీ విద్యుత్ నియంత్రణ మండలి ఛైర్మన్ ఎంపిక కోసం ప్రభుత్వం కమిటీ ఏర్పాటు చేసింది. హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ పి. లక్ష్మణ్ రెడ్డి నేతృత్వంలో ఈ సెలక్షన్ కమిటీని నియమిస్తూ ఇంధన శాఖ కార్యదర్శి నాగులాపల్లి శ్రీకాంత్ ఉత్తర్వులు జారీ చేశారు. ఎంపిక కమిటీ ఛైర్మన్​గా జస్టిస్ పి.లక్ష్మణ్ రెడ్డితో పాటు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, కేంద్ర విద్యుత్ నియంత్రణ మండలి ఛైర్మన్ ను ఎంపిక కమిటీ సభ్యులుగా నియమిస్తూ ఆదేశాలు జారీ అయ్యాయి. ఏపీ ఈఆర్సీ ఛైర్మన్ ఎంపిక కోసం ఇద్దరి పేర్లను ఈ కమిటీ సిఫార్సు చేయనుంది.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details