ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

'ఏళ్లపాటుగా పనిచేస్తున్నా పదోన్నతులు లేవు' - ప్రమోషన్లపై ఏపీ వీఆర్వోల కామెంట్స్

ఏళ్లుగా వీఆర్వోలుగా పనిచేస్తున్నా.. ఎటువంటి పదోన్నతులు లేక ఇబ్బందులు పడుతున్నామని ఆంధ్రప్రదేశ్ గ్రామ రెవెన్యూ అధికారుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఆంజనేయ కుమార్ అన్నారు. వీఆర్వోల సమస్యలు పరిష్కరిస్తామని వైకాపా.. ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పిందని గుర్తు చేశారు.

'ఏళ్ల తరబడి పనిచేస్తున్న ప్రమోషన్లు లేవు'
'ఏళ్ల తరబడి పనిచేస్తున్న ప్రమోషన్లు లేవు'

By

Published : Oct 4, 2020, 8:58 PM IST

విజయవాడ రూరల్ తహసీల్దార్ కార్యాలయంలో ఏపీ గ్రామ రెవెన్యూ అధికారుల సంఘం రాష్ట్ర కమిటీ అత్యవసరంగా సమావేశమైంది. తమకు ప్రమోషన్లు ఇవ్వడం లేదని.. ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఆంజనేయ కుమార్ ఆవేదన వ్యక్తం చేశారు. వీఆర్వోలకు బయో మెట్రిక్ విధానాన్ని తీసివేయాలని కోరారు. 15 రోజుల్లో తమ సమస్యలు పరిష్కరించకుంటే ప్రత్యక్ష ఆందోళనలకు సిద్ధమవుతామని హెచ్చరించారు.

ABOUT THE AUTHOR

...view details