తెలంగాణలో మాజీ ఎమ్మెల్యే బొడిగ శోభ.. తమ మనోభావాలు దెబ్బతినేలా మాట్లాడారని రాష్ట్ర టీఆర్ఎస్ నాయకుడు కొణిజేటి ఆదినారాయణ అన్నారు. "ప్రజా ఉద్యమం చేసి తెలంగాణ సాధించిన కేసీఆర్పై వ్యాఖ్యలు చేయటం సరికాదు" అన్నారు. భాజపా పాలించే రాష్ట్రాల్లో సైతం నిరుద్యోగం ఉందని ఆయన పేర్కొన్నారు. విజయవాడ సీపీ శ్రీనివాసులును కలిసి.. శోభ వ్యాఖ్యలపై ఫిర్యాదు చేశారు. చర్యలు తీసుకోవాలన్నారు.
బొడిగ శోభపై ఏపీ టీఆర్ఎస్ నేత మండిపాటు.. విజయవాడ సీపీకి ఫిర్యాదు - కేసీఆర్పై బొడిగ శోభ కామెంట్స్
తెలంగాణ ముఖ్యమంత్రిపై తీవ్ర వ్యాఖ్యలు చేసిన ఆ రాష్ట్ర మాజీ ఎమ్మెల్యే బోడిగ శోభపై చర్యలు తీసుకోవాలని కోరుతూ.. ఏపీ టీఆర్ఎస్ నేత కొణిజేటి ఆదినారాయణ డిమాండ్ చేశారు. విజయవాడ సీపీ శ్రీనివాసులుకు ఈ విషయమై ఫిర్యాదు చేశారు. భాజపా పాలిత రాష్ట్రాల్లోనూ నిరుద్యోగం ఉందని చెప్పారు.
బొడిగ శోభపై ఏపీ టీఆర్ఎస్ నేత మండిపాటు