- మితిమీరుతున్న రికవరీ ఏజెంట్ల ఆగడాలు, లోన్ కట్టలేదని ఏం చేశారంటే
రికవరీ ఏంజెట్ల వేధింపులు నానాటికీ ఎక్కువవుతున్నాయి. కుటుంబ సభ్యులతో దైవదర్శనానికి వచ్చిన ఓ వాహనదారుడిని ఇబ్బందులకు గురి చేశారు. ఫైనాన్స్‌లో కొన్న వాహనానికి కిస్తీలు చెల్లించలేదని వెహికల్‌ను స్వాధీనం చేసుకున్నారు. తాము దైవదర్శనానికి వచ్చామని చెప్పినా వినకుండా కర్కషంగా వ్యవహరించారు.
- ప్రజలు, ప్రభుత్వ ఆస్తులు కాపాడాల్సిన సీఎం ఏం చేస్తున్నారన్న తెదేపా నేతలు
ప్రభుత్వ ఆస్తులను కాపాడలేరా అంటూ ముఖ్యమంత్రి జగన్‌ను తెదేపా నేతలు ప్రశ్నించారు. లేపాక్షి నాలెడ్జి హబ్ పేరిట అడ్డగోలుగా దోచేసిన జే-గ్యాంగ్ ఇప్పుడు ఇందూ ప్రాజెక్ట్స్ దివాలా ప్రక్రియను అడ్డు పెట్టుకుని భారీ లూటీకి తెగబడిందని ఆరోపించారు.
- Rajasingh arrest నాంపల్లి కోర్టు వద్ద ఉద్రిక్తత, ఇరువర్గాలపై లాఠీఛార్జ్
తెలంగాణ భాజపా ఎమ్మెల్యే రాజాసింగ్‌ను నాంపల్లి కోర్టులో హాజరుపరిచారు. బొల్లారం పీఎస్ నుంచి కోర్టుకు తరలించిన పోలీసులు హాజరుపరిచిన అనంతరం అదుపులోకి తీసుకోనున్నారు. రాజాసింగ్‌కు మద్దతుగా కోర్టు వద్దకు భారీగా ఆయన అనుచరులు వచ్చారు.
- High Court on Capital cases అమరావతి కేసులపై హైకోర్టులో విచారణ
అమరావతి రాజధాని తీర్పుపై సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేసే అంశం ప్రభుత్వం వద్ద పెండింగ్‌లో ఉందని అడ్వకేట్ జనరల్ హైకోర్టుకు తెలిపారు. రాజధానికి సంబంధించిన పిటిషన్లు హైకోర్టులో మరోసారి విచారణకు వచ్చాయి. అమరావతిలో అభివృద్ధి పనులపై హైకోర్టు తీర్పును ప్రభుత్వం అమలు చేయడం లేదని పిటిషనర్ల తరపు న్యాయవాది ధర్మాసనం దృష్టికి తెచ్చారు.
- నీతీశ్ బలపరీక్షకు ముందు స్పీకర్ కీలక వ్యాఖ్యలు
బిహార్ ముఖ్యమంత్రి నీతీశ్ కుమార్ బలపరీక్ష ఎదుర్కోవడానికి ఒక్కరోజు ముందు ఆ రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ విజయ్ కుమార్ సిన్హా కీలక వ్యాఖ్యలు చేశారు. తనపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టినా.. రాజీనామా చేసే ప్రసక్తే లేదని తేల్చిచెప్పారు.
- శ్వేతవర్ణంలో కనువిందు చేసిన అరుదైన సర్పం, ఎక్కడంటే
కర్ణాటక జిల్లా కుమాటా తాలుకలోని రామ్‌నగర్‌కు చెందిన సుబ్రహ్మణ్య నాయక ఇంట్లో ఒక వింత కొండచిలువ దర్శనమిచ్చింది. శ్వేతవర్ణంలో మెరిసిపోతూ ఓ సర్పం కనువిందు చేసింది. దీంతో ఆ పామును చూసేందుకు స్థానికులు అతని ఇంటి వద్ద గుమికూడారు.
- భారతీయ విద్యార్థులకు వీసాలపై చైనా కీలక ప్రకటన
కరోనా నేపథ్యంలో వీసా ఆంక్షల కారణంగా స్వదేశంలో చిక్కుకుపోయిన వందల మంది భారత విద్యార్థులను తిరిగి చైనాలోని విద్యాసంస్థల్లోకి అనుమతించే విషయంలో కొంత ముందడుగు పడింది. వారంతా తిరిగి చైనాకు వెళ్లేందుకు వీలుగా త్వరలోనే వీసాలు జారీ చేయనున్నట్లు చైనా ప్రకటించింది.
- అవన్నీ తెలుసుకున్నాకే సూచీ ఫండ్లలో పెట్టుబడులు, ప్రయోజనాలు ఇవే
స్టాక్ మార్కెట్లలో మంచి లాభాలను ఆర్జించాలనుకుంటున్నారా. అయితే మార్కెట్ వృద్ధిని ప్రతిబింబించే సూచీల్లో పెట్టుబడులు పెడితే నిర్వహణలోనూ ఇబ్బందులు ఉండవు. ఇప్పుడు దాదాపు అన్ని ఫండ్ సంస్థలు ఈ సూచీ ఫండ్లను తీసుకొస్తున్నాయి. దీని గురించి తెలుసుకుందాం.
- ప్రొడ్యూసర్స్ గిల్డ్ కీలక నిర్ణయం, షూటింగ్స్‌కు గ్రీన్‌సిగ్నల్, ఆరోజు నుంచే షురూ
సినిమా షూటింగ్స్‌కు ప్రాధాన్య క్రమంలో అనుమతించనున్నట్లు ప్రొడ్యూసర్స్ గిల్డ్ ప్రకటించింది. ఈ నెల 25 నుంచి షూటింగ్స్ ప్రారంభించనున్నట్లు తెలిపింది.
- కోహ్లీ పరుగుల దాహం ఇంకా తీరలేదు, ఆ ఒక్క పనిచేస్తే నోళ్లన్నీ మూతపడతాయి
వచ్చే ఆదివారం ఆసియా కప్ ప్రారంభ మ్యాచ్‌లో చిరకాల ప్రత్యర్థి పాక్‌తో భారత్ తలపడనున్న వేళ.. కోహ్లీ ఫామ్ గురించి ఇండియన్ టీమ్ మాజీ కోచ్ రవిశాస్త్రి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
ఏపీ ప్రధాన వార్తలు